
ఆదివారం సాయంత్రం 6 గంటలకు పుష్ప-2 ట్రైలర్ బిహార్ రాజధాని పాట్నాలో రిలీజ్ చేయబోతున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లేదా ఏపీలో ఎక్కడో అక్కడ నిర్వహిస్తే సహజంగానే అనిపిస్తుంది.
పుష్ప-2 టీం పాట్నాని ఎంచుకోవడమే ఆశ్చర్యమనుకుంటే, మూడు రోజులుగా బిహార్ యువత ఈ కార్యక్రమం కోసం మహాత్మాగాంధీ మైదానంలో జరుగుతున్న భారీ ఏర్పాట్లను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివస్తుండటం, పాసుల కోసం క్యూకడుతుండటం ఇంకా ఆశ్చర్యం కలిగిస్తుంది.
ప్రతీరోజూ వందలాదిమంది యువకులు అక్కడకు చేరుకొని సినిమా, ఈవెంట్ గురించి అడిగి తెలుసుకుంటున్నారు. తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకుంటున్నారు. వారి మాటలు, ఉత్సాహం, సంతోషం చూస్తుంటే అల్లు అర్జున్ దక్షిణాదికి చెందిన నటుడు అనే భావన ఎవరిలోనూ కనిపించడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో అల్లు అర్జున్ అభిమానులకు తాము ఏమాత్రం తీసిపోమ్మన్నట్లు ఉత్సాహంతో మాట్లాడుతున్నారు.
పుష్ప సినిమాని చూసినప్పటి నుంచి తాము అల్లు అర్జున్ అభిమానులైపోయామని, పుష్ప-1 కంటే పుష్ప-2ని వంద రెట్లు హిట్ చేస్తామని చెపుతున్నారు.
పుష్ప-2 సినిమా రిలీజ్ రోజున థియేటర్ల వద్ద పూలు, కాగితాలు, టపాకాయలు కాదు… తుపాకులు పేల్చి ఘనస్వాగతం చెప్తామని చెపుతున్నారు.
పుష్ప-2కి బిహార్‌లో ఈ స్థాయిలో ఆదరణ లభిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ దానికి చాలా బలమైన కారణాలే ఉన్నాయి.
బిహార్‌లో దశాబ్ధాల తరబడి అరాచక పరిస్థితులు నెలకొని ఉండేవి. సామాజికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా బలంగా ఉన్నవారి చేతులలో బడుగు బలహీనవర్గాలు, నిరుపేదలు పీడనకు గురయ్యేవారు. ఇదే కారణంగా బిహార్‌లో నక్సల్ ఉద్యమం మొదలై దేశంలో పలురాష్ట్రాలకు వ్యాపించింది. బిహార్‌లో తుపాకీ సంస్కృతి విచ్చలవిడిగా ఉండేది. నేటికీ కొంత ఉంది.
పుష్పలో ఇవన్నీ ప్రతిబింబించాయి కనుకనే దానితో ఇంత బాగా కనెక్ట్ అయ్యారు. ఓ సాధారణ కూలీ స్థాయి నుంచి ఎర్ర చందనం స్మగ్లింగ్ వ్యాపారాన్ని… రాజకీయాలను శాశించే స్థాయికి ఎదిగిన పుష్పలో తమని తాము చూసుకుంటున్నారు. అందుకే అల్లు అర్జున్ వారి అభిమాన హీరో అయ్యాడు. బిహార్‌లో ఆ వీరాభిమానులే పుష్ప-2ని సూపర్ డూపర్ హిట్ చేస్తామని ముందే ప్రకటించేశారు.
దక్షిణాది నుంచి చాలా మంది బాలీవుడ్‌లోకి వెళ్ళారు కానీ అల్లు అర్జున్ ఒక్క పుష్ప సినిమాతోనే సంపాదించుకున్న ఇంత అభిమానులను మరే హీరో సంపాదించుకోలేకపోయారనే చేపోచ్చు. ఇప్పుడు బిహార్ యువత రాజకీయా ప్రక్షాళన, మార్పు కోరుకుంటున్నారు. అటువంటి కధతో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌గా వారి ముందుకు రాబోతున్నాడు. కనుక ఈ రెండు సినిమాల తర్వాత ఉత్తరాది రాష్ట్రాలలో కూడా రామ్ చరణ్, అల్లు అర్జున్ సినిమాల మద్య పోటీ ఏర్పడే అవకాశం ఉంటుంది.
Jailer 2 is scheduled to arrive in theatres this week. However, the makers have opted…
Janani Ashok Kumar gives classic polka dots a fresh, flirty update in this outdoor photoshoot.…