
మరో నాలుగు రోజుల్లో సిల్వర్ స్క్రీన్ పైకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వనున్న నేపధ్యంలో, యంగ్ టైగర్ ఫ్యాన్స్ అండ్ సినీ ప్రియులంతా “దేవర” రాక కోసం నిరీక్షిస్తున్నారు. కానీ ఈ టైమ్ లో “పుష్ప” ఎంట్రీ ఇచ్చి అల్లు ఫ్యాన్స్ ని అదరకొట్టారు.
డిసెంబర్ 6 వ తేదీన రిలీజ్ కాబోతున్న “పుష్ప 2” సినిమాకు 75 రోజుల కౌంట్ డౌన్ వేస్తూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది. చడీచప్పుడు లేకుండా విడుదల చేయడంతో బన్నీ ఫ్యాన్స్ అవాక్కయ్యారు.
మునుపెన్నడూ లేని విధంగా ఇండియన్ సినిమాను “పుష్ప 2” షేక్ చేస్తుందని, ఎవరూ మ్యాచ్ చేయలేని విధంగా సిల్వర్ స్క్రీన్ పై పుష్ప క్యారెక్టర్ ఉండబోతుందని ఫ్యాన్స్ ను మరింతగా ఉత్తేజపరిచారు.
దసరా కానుకగా జాతర పాట వస్తుందని అభిమానులు వేచిచూస్తుండగా, ఇంతలోనే పోస్టర్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటివరకు విడుదల చేసిన ప్రమోషన్స్ ఫ్యాన్స్ ని ఆకట్టుకునే విధంగా ఉండడంతో పాటు, అంచనాలను కూడా అమాంతం పెంచింది.
దీంతో గత లెక్కలను సరిచేసే విధంగా “పుష్ప 2” రికార్డులు ఉండబోతున్నాయనే అంచనాలు దేశవ్యాప్తంగా నెలకొన్నాయి. బాలీవుడ్ లో కూడా “పుష్ప 2″పై అంచనాలు ఆకాశంలో ఉండడంతో, రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ పక్కాగా చేస్తే ఓపెనింగ్స్ అదిరిపోతాయని ట్రేడ్ వర్గాలలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీలు అవలీలగా మెజార్టీ స్థానాలు దక్కించుకుంటాయి. కనుక ఏపీలో కూటమి పార్టీలు కూడా…
The Indian IT sector is already witnessing a period of turbulence with several companies starting…