Telugu

ఈ స్థానిక పరీక్షలు వైసీపీకి కాదు.. కూటమికే!

సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీలు అవలీలగా మెజార్టీ స్థానాలు దక్కించుకుంటాయి. కనుక ఏపీలో కూటమి పార్టీలు కూడా అలాగే దక్కించుకోవచ్చు.

కానీ మేయర్, మున్సిపల్ చైర్మన్‌, ఇతర సీట్ల కోసం మూడు పార్టీలు పట్టుపడుతుండటం, వాటి మద్య చర్చలు జరుగుతుండగానే ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు రిజర్వేషన్స్ ప్రకటించడంతో ఇంతకాలంగా సాగుతున్న ‘కోల్డ్ వార్స్’ కాస్తా ఇప్పుడు బయటపడుతున్నాయి.

ADVERTISEMENT

మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నప్పుడు, సీట్ల విషయంలో ఇటువంటి వార్స్ సర్వసాధారణమే. కానీ వైసీపీ చేతికి మట్టి అంటకుండా, వాటిలో అవే కీచులాడుకొని విడిపోయే పరిస్థితి కల్పించుకోవడం విస్మయం కలిగిస్తుంది.

ప్రభుత్వం రిజర్వేషన్స్ ప్రకటించడంతో ఆయా స్థానాలలో పోటీ చేయాలనుకున్న జనసేన నేతలకు పెద్ద షాక్ అనే చెప్పాలి. కానీ కొన్ని కీలక స్థానాల (పదవులు)ను ప్రభుత్వం ‘జనరల్’, ‘అన్‌ రిజర్వడ్’, ‘బీసీ’, ‘బీసీ మహిళ’లకు కేటాయించడం వైసీపీకి బాగా కలిసి వచ్చింది.

ఉదాహరణకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయక మునుపే నెల్లూరు మేయర్ పదవికి ఆనం ను వైసీపీ అభ్యర్ధిగా ప్రకటించింది. ప్రభుత్వం ఆ పదవిని ‘జనరల్’కు కేటాయించడంతో వైసీపీకి లైన్ క్లియర్ చేసినట్లయింది.

కానీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం మున్సిపల్ చైర్మన్‌ ఒకవేళ ఈ సీటుని బీసీ లేదా బీసీ మహిళకు కేటాయిస్తే జనసేనకు కేటాయించినట్లు ఉండేది. కానీ ఈ సీటుని ‘ఎస్సీ జనరల్’కు కేటాయించడంతో జనసేనకు షాక్ ఇచ్చినట్లయింది.

ఆ సీటు మాకేనని జనసేన పట్టుబడుతుంటే, పవన్ కళ్యాణ్‌ కోసం తాను త్యాగం చేసినందున ఆ సీటుని తమకే ఇవ్వాలని టీడీపి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ వర్గం పట్టుబడుతోంది.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా 17 మున్సిపల్ కార్పోరేషన్లు, 123 మున్సిపాలిటీల రిజర్వేషన్లు చూస్తే, వాటిలో చాలా వరకు జనసేన, బిజేపిల కంటే టీడీపి, వైసీపీలకు బలం ఉన్నచోట్ల ఆయా వర్గాలకే కేటాయించినట్లు అనిపిస్తుంది.

ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ మాట్లాడుతూ, “ఇదివరకు జగన్‌ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు మొట్ట మొదట స్పందించింది మేమే. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని మేము చాలా త్యాగాలు చేశాం. కనుక ఈ గ్రామ, పట్టణ స్థాయిలో మా పార్టీని బలోపేతం చేసుకునేందుకు స్థానిక సంస్థల ఎన్నికలలో సముచిత స్థానాలు కావాలని కోరుకోవడం తప్పు కాదు,” అని అన్నారు.

కానీ ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్స్ జనసేన ఆలోచనలకు భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కనుక ఈరోజు మధ్యాహ్నం జనసేన కార్యాలయంలో, మళ్ళీ సాయంత్రం ఉండవల్లిలో జరుగబోయే టీడీపి, జనసేన నేతల సమావేశం చాలా కీలకం కాబోతోంది.

జనసేన, బిజేపిలకు ముఖ్యంగా జనసేనకు సంతృప్తి కలిగిస్తే మంచిదే. లేకుంటే కూర్చొన్న కొమ్మను అందరూ కలిసి నరుక్కునట్లు అవుతుందని జనసేన మద్దతుదారులు సోషల్ మీడియాలో పదేపదే హెచ్చరిస్తూనే ఉన్నారు.

కనుక ఈ స్థానిక పరీక్షలు వైసీపీకి కాదు.. కూటమికే! ఫెయిల్ చేసుకుంటాయో పట్టువిడుపులతో పాస్ అవుతాయో చూడాలి!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Shocking From CEO: Mass Layoffs In Indian IT?

The Indian IT sector is already witnessing a period of turbulence with several companies starting…

6 minutes ago

Late to the Party, Lost at the Box Office!

A blockbuster in one language creates curiosity in other markets, but that excitement doesn't last…

35 minutes ago