Telugu

పుష్ప; తగ్గుతుందా,తగ్గిస్తున్నారా..?

2021 డిసెంబర్ నెలలో ప్రేక్షకుల వద్దకు వచ్చిన పుష్ప, విడుదలకు ముందే ఆ సినిమా లో ని పాటలతో మాస్ రీచ్ అందుకుంది. వచ్చిన ప్రతి పాట సూపర్ హిట్ అవ్వటం తో సినిమా పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి అనుగుణంగానే,విడుదల తరువాత, మొదట కాస్త నెగటివ్ టాక్ వచ్చినా,పాటలు,అల్లు అర్జున్ యాక్షన్, సుకుమార్ టేకింగ్, ఇవన్నీ కలగలిసి సినిమా ని గాడి లో పెట్టాయి.

ADVERTISEMENT

రిలీజ్ తరువాత పుష్ప పాటలు కేవలం వెండి తెర కే అంకితం కాలేదు, క్రికెట్ గ్రౌండ్ లో దిగ్గజాలు సైతం పుష్ప స్టెప్పులు వేసారు. విరాట్ కోహ్లీ,రవీంద్ర జడేజా మరియు ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ అయితే పుష్ప సినిమా ను సొంతం చేసుకున్నారు అనే చెప్పాలి. ఫుట్బాల్ ఆటగాళ్లు సైతం పుష్ప పాటలకు తందనాలాడారు. భారత దేశం లోని ప్రతి మూలకు పుష్ప చేరుకుంది. ఇలా, పార్ట్-1 తో ఇంతటి మన్నన పొంది, పార్ట్-2 పై మరింత అంచనాలు పెంచేసింది పుష్ప.

అల్లు అర్జున్ సైతం ఈ సినిమాకు ఎంత కష్ట పడ్డారో దర్శకుడు పలు సార్లు వెల్లడించారు. పుష్ప; అల్లు,సుక్కు ల జోడి లో వచ్చిన మూడవ సినిమా కావటంతో వారి మధ్య మంచి బంధం ఏర్పడింది. విడుదల తరువాత అర్జున్,సుక్కు పలు స్టేజిలపై ఒకటైనప్పుడు సైతం,వారి బంధం గురించి, పార్ట్-2 మీద ఫాన్స్ కు ఉన్న అంచనాలను వారు సంతృప్తి చేకురుస్తామని పలు సార్లు చెప్పారు.

అయితే, తొలుత ఆగష్టు 15 2024 ను విడుదల తేదీ గా ప్రకటించి,ఇక పోస్టుపోన్ అనే మాట కు తావే లేదు అన్నట్టు పనులు సెరవేగంగా సాగాయి. మరి,ఇలాంటి సమయం లో ఆంధ్రాలో ని జనరల్ ఎలక్షన్లలో అల్లు అర్జున్ చేసిన పని వలనే టీం కు నెగటివిటీ తారా స్థాయి లో వచ్చిందని పలు సంస్థలు వెల్లడించాయి. ఇక,ఏదేమయినప్పటికీ, వారికి పార్ట్-1 అత్యద్భుత విజయం తెచ్చి పెట్టిన ఆ డిసెంబర్ మాసానికే మళ్ళి వస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించారు.

మళ్ళీ షూటింగ్ యధివిధి గా సాగుతుంది, చెప్పినట్టే డిసెంబర్ నెలకు పుష్ప-2 వచ్చేస్తుంది అంటూ సంతోష పడిన ఫాన్స్ కు మళ్ళి బ్రేక్ పడినట్టే కనిపిస్తుంది. తాజాగా, అల్లు అర్జున్ తన లుక్ ను మార్చి, ఒక ఫ్లైట్ లో పయనించినట్టు వచ్చిన ఒక విడియో నెట్టింట అనేక రూమర్స్ కు వేదిక అయింది. అల్లు అర్జున్ కు సుకుమార్ కు మధ్య విభేదాలు ఏర్పడ్డాయని దాని ఫలితంగానే అర్జున్ తన లుక్ ను మార్చి, విదేశాలకు పయనమయ్యారంటూ వార్తలు వచ్చాయి.

దానికి అల్లు అర్జున్ టీం ప్రతిస్పందిస్తూ, అవన్నీ ఫాల్స్ రూమర్స్ అంటూ చెప్పినప్పటికీ, వారు ఖరాకండి గా రిలీజ్ డేట్ మీద ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. ఇదంతా ప్రీ-షెడ్యూల్డ్ ప్రయాణమే అంటున్నా, పుష్ప-2 సెట్స్ లో అంత మంచి వాతావరణం లేదు అంటూ సోషల్ మీడియాలో రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది.

పుష్ప – 2 మీద వస్తున్న గాసిప్స్ కూడా సినిమాను ఎప్పటికప్పుడు లైవ్ లైట్ లో ఉంచడంలో సాయపడుతూనే ఉంది. పార్ట్-1 అంతటి భారీ పాపులారిటీ ని తెచ్చిపెట్టడంతో, దాన్ని ఒడిసిపట్టుకోవటం సుక్కు కు కాస్త కష్టమవుతుందా..? హీరో ఇమేజ్ కు తగ్గట్టుగా అల్లు ఫాన్స్ తో పాటు పుష్ప రాజ్ అభిమానులను కూడా సుక్కు ఆకట్టుకోగలగాలి.

ఒకపక్క టాలీవూడ్ సినిమా స్థాయి పెరిగిపోవడంతో తెలుగు పరిశ్రమ నుండి విడుదలకు సిద్దమవుతున్న సినిమాల మీద కూడా దేశ వ్యాప్తంగా అంచనాలు ఎక్కువయిపోతున్నాయి. కల్కి తో నాగ అశ్విన్, ప్రభాస్ సృష్టించిన ప్రభంజనం ముందు తగ్గేదెలా అంటూ పుష్ప నిలవనుందా?

కమర్షియల్ సినిమా కే ఇన్ని అడ్డంకులు వస్తే, మరి సుక్కు తరువాత తీసే సినిమాలు ఎలా హేండిల్ చేస్తారంటూ నెటిజన్లు నెట్టింట్లో కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప కు ఇన్ని అడ్డంకులు రావటం.. ‘పుష్ప; తగ్గుతుందా… తగ్గిస్తున్నారా?’ అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఈ రూమర్స్ అన్నిటికి బ్రేక్ పడి, పుష్ప రాజ్ మళ్ళీ సెట్స్ పైకి ఎప్పుడు వేళ్తాడో చూడాలి మరి ..?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Half-Satisfying for Rajinikanth, Full Meals for Chiranjeevi?

Following the terrible failure of Retro, Karthik Subbaraj has made a comeback with the film…

28 minutes ago

Akshay Kumar’s 40-Day Film Habit Returns to Haunt Him?

Akshay Kumar and Vipul Amrutal Shah are collaborating on Samuk, a science-fiction action thriller. Latest…

48 minutes ago