
అలా పబ్లిక్ లేదా మీటింగ్ లలో ఆమె సంకేత భాషను ఆశ్రయిస్తారు. ఈ మేరకు సిబ్బందికి ట్రైనింగ్ కూడా ఇస్తారు. అలాంటి సంకేత భాషలో ఆమె వెడ్డింగ్ రింగ్, హ్యాండ్ బ్యాగ్ కీలక పాత్ర పోషిస్తాయి. వెడ్డింగ్ రింగ్ ను ఆమె పక్కకు తిప్పారంటే… అక్కడ జరుగుతున్న సంభాషణ విషయాన్ని మళ్లించాలి. ‘మీరు వచ్చి జోక్యం చేసుకోండి’ అని అర్థమని, అలా ఆమె రింగ్ ను పక్కకు తిప్పగానే, ఆమె సిబ్బంది ఎవరో ఒకరు వచ్చి మర్యాదగా ఏదో ఒక విషయం చెప్తారని, అలా సంభాషణ టాపిక్ మారిపోతుంది.
అంతే కాకుండా, తన హ్యాండ్ బ్యాగును ఒక చేతి నుంచి మరో చేతికి మార్చితే ప్రసంగం ముగించాలని అనుకుంటున్నారని అర్థం. అలా కాకుండా అదే హ్యాండ్ బ్యాగు బల్ల మీద పెడితే అక్కడి నుంచి వెళ్లిపోవడానికి సిగ్నల్ ఇస్తున్నారని అర్థం. అలా బహిరంగ ప్రదేశాలు, మీటింగ్ లు కాకుండా క్వీన్ ఎలిజబెత్-2 అధికారిక నివాసమైన బకింగ్ హామ్ ప్యాలస్ లో సమావేశాలు ఉంటే మాత్రం తన సిబ్బందిని పిలిచేందుకు రాణి ఓ ప్రత్యేకమైన బజర్ వాడతారు.
అది నొక్కితే అతిథులని లోపలికి ఆహ్వానించడానికి ప్యాలస్ తలుపులు తెరవాలని సంకేతం అని వెల్లడించారు. ఈ సైగల భాషను క్వీన్ ఎలిజబెత్ మాత్రమే కాకుండా ఆమె మనవరాలు కేట్ మిడిల్టన్ కూడా పాటిస్తుంటారని, కేట్ బయటికి వెళ్లినప్పుడు క్లచ్ బ్యాగ్ మాత్రమే తీసుకెళ్తారు. కేట్ కి ఒక చేత్తో బ్యాగ్ పట్టుకుని నడవడం అస్సలు నచ్చదు. అలా నడుస్తున్నప్పుడు చేతులు వూపాల్సి వస్తుందని రెండు చేతులతో బ్యాగును ముందు పెట్టుకుని నడుస్తుంటారని తెలిపారు.
తెలంగాణ గడ్డ మీద పుట్టిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో దాదాపు కనుమరుగయిపోయిందనే చెప్పాలి. తెలంగాణలో టీడీపీ…
Rashmika Mandanna has achieved another major milestone. The actress, who began her career with Kirik…