
అయితే ‘టెంపర్’ వంటి చిత్రాలలో కీలక పాత్రల కోసం పూరీ జగన్నాధ్ వంటి దర్శకుడు అడిగిన సమయంలో కూడా నారాయణమూర్తి గారు సున్నితంగా తిరస్కరించారు. ఎలా తిరస్కరించారో కూడా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ‘ఒసేయ్ రాములమ్మ’ సినిమాలో తన గురువు గారు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు తను పోషించిన పాత్ర కోసం మొదటగా తననే అడిగారని, అయితే నాతో ‘ఒరేయ్ రిక్షా’ వంటి సినిమాను తీసిన తన గురువు గారికి ‘నమస్కరించి’ పెట్టి తానూ చేయలేనని అన్నారు.
అలాగే తన శ్రేయోభిలాషి అయినటువంటి పూరీ గారు అడిగినపుడు కూడా ఇదే చేసానని… మీరు చెప్తున్నట్లు రజనీకాంత్ గారు నన్ను అడిగినా, పవన్ కళ్యాణ్ అడిగినా… నమస్కరించి చేయలేనని చెప్పడం తప్ప తనకేమి తెలియదని, అయినా వాళ్ళు నన్ను అడగరు, నేను చేయను… రెండు జరగవు అంటూ తనదైన శైలిలో నారాయణమూర్తి గారు తన భావాలను వ్యక్తపరిచారు.
Kamakshi Bhaskarla is an emerging actress in Tollywood who is trying to establish herself as…
Nandamuri Balakrishna is starring in an action film directed by Gopichand Malineni. The makers have…