
దీనికి పోటీగా కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ వస్తోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ముగిసి రెగ్యులర్ షూటింగ్‌కు రెడీ అవుతోంది. ఇటీవల ఎన్టీఆర్ ఘాట్‌లో తొలి షాట్ కోసం ప్రయత్నించగా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సినిమాకు తన అనుమతి లేదని, సినిమా తీస్తే తీవ్ర పరిణామాలుంటాయని లక్ష్మీపార్వతి కూడా కేతిరెడ్డిని హెచ్చరించారు.
ఈ సినిమాపై వివాదం కొనసాగుతుండగానే ఈ చిత్రంలో లక్ష్మీపార్వతిగా ఎవరు నటించోతున్నారన్న దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. తొలుత వాణీవిశ్వనాథ్‌ను అనుకున్నట్టు వార్తలు వచ్చాయి. తనను సంప్రదిస్తే నటించేందుకు రెడీ అంటూ ఆమె కూడా బహిరంగంగానే ప్రకటించారు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరూ తెలిసిపోయిందంటూ టాలీవుడ్లో వార్తలు గుప్పుమన్నాయి.
‘కాటమరాయుడు, ఖైదీ నంబరు 150’ సినిమాల్లో స్పెషల్ సాంగుల్లో చిందేసిన రాయ్‌లక్ష్మిని లక్ష్మీపార్వతి పాత్ర కోసం ఎంపిక చేసినట్టు లేటెస్ట్ టాక్. అదే కనుక నిజమైతే ఈ సినిమా మరింత సంచలనం సృష్టించడం ఖాయమని అంటున్నారు. అయితే ఈ విషయంలో దర్శకుడు కేతిరెడ్డి నుంచి ఎటువంటి సమాచారం లేదు. కాగా రాయ్‌లక్ష్మి నటించిన ‘జూలీ 2’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
నేడు రాష్ట్రమంతటా జరుగుతున్న పోలింగ్ ఒక ఎత్తు అయితే పులివెందుల పోలింగ్ ఒక్కటీ మరో ఎత్తు అన్నట్లు సాగుతోంది. ఎక్కడికక్కడ…
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి “చొక్కా మడత పెడతా.. పులివెందులలో ఓటు వేస్తా... ఎవరు అడ్డుకుంటారో అడ్డుకోండి చూస్తానంటూ..” రెండు…