
“ఊహలు గుసగుసలాడే” సినిమాతో తెలుగులో డెబ్యూ ఇచ్చిన రాశిఖన్నా.. తొలి చిత్రంతోనే ప్రేక్షకుల మనసులు దోచుకుంది. ఆ తర్వాత మళ్లీ హిట్ అందుకోవడానికి టైమ్ పట్టినా.. తన లుక్స్ తోనే మ్యానేజ్ చేసింది. “సుప్రీమ్” సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాక కూడా టాప్ హీరోయిన్ గా ఎదగడానికి సరైన పునాది మాత్రం దొరకలేదు. ఎన్టీఆర్ సరసన “జై లవకుశ” సినిమాలో అవకాశం అందిపుచ్చుకున్నా.. ఎందుకో ఆమెకు ఆశించిన గుర్తింపు దొరకలేదు.
తెలుగులో సరైన అవకాశాలు లేకపోవడంతో హిందీలో వెబ్ సిరీస్ లు చేయడం మొదలెట్టింది. “ఫర్జీ, లుక్కే” వంటి వెబ్ సిరీస్ లు చేసింది. “ఫర్జీ”కి మంచి పేరు రాగా.. “లుక్కే” మాత్రం ఎవర్నీ అలరించలేకపోయింది. దాంతో ఆమె పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు తలెత్తాయి. కట్ చేస్తే.. ఇవాళ చెన్నైలో ప్రారంభోత్సవం జరుపుకున్న రజనీకాంత్ 173వ చిత్రం ఓపెనింగ్ ప్రెస్ మీట్ లో రాశిఖన్నా కనిపించింది. “ధర్మన్” అనే టైటిల్ పెట్టబడిన ఈ చిత్రానికి ప్రదీప్ రంగనాథన్ తో “డ్రాగన్” సినిమా తెరకెక్కించిన అశ్వత్ దర్శకుడు. కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సిమ్రాన్ హీరోయిన్ గా రజనీకాంత్ సరసన కనిపించనుండగా.. మిగతా కీ క్యాస్ట్ ఎవరు అనేది తెలియాల్సి ఉంది.
రాశీఖన్నాకి ఇప్పుడు రజనీకాంత్ సినిమాలో అవకాశం అనేది గోల్డెన్ ఆఫర్ లాంటిది. ఈ సినిమా తర్వాత ఆమె మళ్లీ స్టార్ హీరోయిన్ జాబితాలోకి ఎంటర్ అవ్వకపోయినా.. ఈ సినిమాకి వచ్చే క్రేజ్ & పబ్లిసిటీతో ఇంకొన్నాళ్లపాటు సౌత్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకోవడం ఖాయం. మరి రాశీఖన్నాను ఇప్పటికైనా మన తెలుగు దర్శకులు, మేకర్స్ స్టార్ హీరోయిన్ గా చూస్తారా అనేది డౌటే.
India's 351/7 looked like a strong enough total, but the third ODI against West Indies…
Legendary filmmaker Singeetham Srinivasa Rao has passed away at Kauvery Hospital in Chennai following ill…