
‘గబ్బర్ సింగ్’ పోలీస్ క్యారెక్టర్ మాదిరి కనపడుతున్న శర్వానంద్ పాత్ర, ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందించడంలో సక్సెస్ సాధించింది. ముఖ్యంగా ఈ ట్రైలర్ కు బ్యాక్ బోన్ గా నిలిచింది మాత్రం రాడాన్ అందించిన నేపధ్య సంగీతం. ఫుల్ జోష్ తో కూడిన సంగీతానికి శర్వానంద్ హావభావాలు, డైలాగ్స్ తోడు కావడంతో ట్రైలర్ అంతా ఎంటర్టైన్మెంట్ గా సాగింది. అయితే రొటీన్ కమర్షియల్ సినిమా మాదిరి కనిపించడం ప్రధాన మైనస్.
ముఖ్యంగా టాలీవుడ్ లో సూపర్ హిట్లుగా నిలిచిన ‘గబ్బర్ సింగ్, రేసుగుర్రం’ సినిమాల సన్నివేశాలు గుర్తుకు రావడం ఫ్రెష్ నెస్ ను కలిగించలేకపోయింది. అయితే వీటన్నింటిని శర్వా తనదైన నటనతో అధిగమిస్తాడో లేదో అన్న విషయం వచ్చే వారంలో తేలనుంది. చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శర్వాకు జతగా లావణ్య త్రిపాఠి, అక్షలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. విడుదలైన ఈ సినిమా ఆడియో శ్రోతలను ఆకట్టుకోవడం ప్లస్ పాయింట్.
The last time, Pawan Kalyan delivered a good theatrical experience to a reasonable extent was…
Nimrit Kaur is redefining raw ethnic elegance with an earthy, unapologetically sultry photoshoot that is…