Telugu

ఇంటిమేట్ సీన్స్ చేసినప్పుడు లేని భయం…

ప్రముఖ బాలీవుడ్‌ సినీ నటి రాధికా ఆప్టే తాజాగా లస్ట్ స్టోరీస్-3లో నటించారు. ఆ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గోనప్పుడు ఆమె తాను ఎదుర్కొన్న ఓ సమస్య గురించి చెప్పారు.

తాను నటించిన ఓ ఇంటిమేట్ సీన్ లీక్ అయినప్పుడు, దానిని తన కారు డ్రైవరు, వాచ్ మ్యాన్ తమ మొబైల్ ఫోన్లలో పదేపదే చూస్తుండేవారని, అప్పుడు తాను చాలా అభద్రతాభావానికి లోనయ్యానని చెప్పారు.

ADVERTISEMENT

చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఈ విషయం తెలిసి ఉంటుందని, వాళ్ళు నా ఇంటికి వచ్చేస్తారేమోనని ఆందోళన చెందానని చెప్పారు.

అలాగే సినిమా షూటింగ్‌లలో తన వంటి మహిళా నటులు దుస్తుల విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామని రాధికా ఆప్టే చెప్పారు.

సినిమాలలో ఇంటిమేట్ సన్నివేశాలు చేస్తున్నప్పుడు, వాటిని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రదర్శిస్తారని, వాటిని అందరూ చూస్తారని వేరే చెప్పక్కరలేదు. నిజానికి అలా చూపించేందుకే సినిమాలు తీస్తారు.

‘లస్ట్ స్టోరీస్’ పేరులోనే ఆ సినిమా దేని గురించో అర్ధమవుతుంది. ఆ లస్ట్‌ను వారు బాగా రక్తి కట్టించారు.. ప్రేక్షకులకు అది నచ్చింది గాబట్టే లస్ట్ స్టోరీస్-3 చేశారు. కనుక మరో పది లస్ట్‌ స్టోరీలు వచ్చినా ఆశ్చర్యం లేదు.

అలాంటి సినిమాలలో అలాంటి పాత్రలు చేస్తూ, వాటిని ఇరుగుపొరుగువారు లేదా తన కారు డ్రైవరు, వాచ్ మ్యాన్ చూశారని ఆందోళన చెందానని చెప్పడం, అభద్రతాభావానికి లోనయ్యానని రాధికా ఆప్టే చెప్పడం విచిత్రంగానే అనిపిస్తుంది.

సినీ పరిశ్రమలో కేవలం మహిళలు మాత్రమే సమస్యలు ఎదుర్కోవడం లేదు. వారొక రకం సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే, పురుషులు వేరే రకమైన సమస్యలు ఎదుర్కొంటారు.

ఏ రంగంలోనైన సరే, మరీ ముఖ్యంగా… సినీ పరిశ్రమలో అవ్వా కావాలి బువ్వా కావాలి అంటే సాధ్యం కాదని బయటవారి కంటే పరిశ్రమలో ఉన్నవారికే బాగా తెలుసు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Bigg Boss Actress Arrest: Rs. 27 Lakh Extortion Shock?

Bigg Boss Tamil fame actress Varshini Venkat, also known as Vardhini, has been arrested by…

6 minutes ago

సినిమాలకు, రాజకీయాలకు హైప్ అవసరమే కానీ…

సినిమాలలోనైనా, రాజకీయాలలోనైనా అనవసరంగా ‘హైప్’ సృష్టించుకుంటే లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు 2024 ఎన్నికలలో వైసీపీ 175/175…

37 minutes ago