
నాటి చిత్రం “న్యాయం కావాలి” షూటింగ్ లో చిరంజీవి, రాధిక ఒకరినొకరు చెంపదెబ్బ కొట్టుకున్నారని ఆ చిత్ర దర్శకుడు కోదండరామిరెడ్డి అన్నారు. “న్యాయం కావాలి”లో ఒక సన్నివేశంలో చిరంజీవిని రాధిక చెంపదెబ్బ కొట్టే సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా… రాధిక నిజంగానే చిరంజీవిని కొట్టింది. మరో సన్నివేశంలో రాధికను చిరంజీవి చెంపదెబ్బ కొట్టాలి. ఆ సీన్ లో చిరంజీవి కూడా నిజంగానే రాధిక చెంపపై కొట్టారు. దీంతో వారి మధ్య ఘర్షణ జరిగింది… అంటూ నాటి ఉదంతాలను ప్రస్తావించారు.
ఆ తర్వాత, వీరిద్దరి కాంబినేషన్ లోనే నా తదుపరి చిత్రం “అభిలాష” కూడా తీశాను. ఈ చిత్రం షూటింగులో కూడా చిరంజీవి, రాధికలు ఎడమొహం, పెడమొహంగా ఉండేవారు. ఆ తర్వాత వాళ్లిద్దరికీ నచ్చజెప్పడంతో సమస్య సద్దుమణిగింది… అంటూ చెప్పిన మెగాస్టార్ గత అనుభవాలను అభిమానులు ఆసక్తిగా ఆలకిస్తున్నారు. అంత కష్టపడి పైకి వచ్చారు కాబట్టే సినీవినీలాకాశంలో ‘మెగాస్టార్’ హోదాను సంపాదించుకుని, అశేష అభిమానుల పాలిట అభిమాన దేవుడయ్యాడు అంటున్నారు మెగా అభిమానులు.
Irumudi has completely changed Ravi Teja’s career equation. After a long run of bad films,…
కొండా సురేఖ మంత్రి పదవి బర్తరఫ్ తరువాత కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు…