Telugu

ఏదొకటి చెప్తుంటే ‘షారుక్’నే ప్రశ్నించానని చెప్పిన ‘హీరోయిన్’

బాలీవుడ్ ‘బాద్ షా’ షారూక్ ఖాన్ నటించిన ‘రయీస్’ చిత్రం ద్వారా పాకిస్థాన్ నటి మహీరా ఖాన్ వెండితెరకు పరిచయం అవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్ నిమిత్తం దుబాయ్ లో బిజీగా ఉన్న ఆమె, షారూక్ తో కలిసి పనిచేసిన అనుభవం ఎలా ఉందో చెప్పుకొచ్చింది. ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్నపుడు ఎలా నటించాలనే విషయమై షారూక్ తనకు తరచుగా చెబుతుండేవారని చెప్పింది.

అయితే, షారూక్ అదే పనిగా చెబుతుండటంతో, ‘నేను సరిగా చేయడం లేదా? అంటూ ఓ సారి ఆయన్ని అడిగేశానని చెప్పింది. ‘నా అనుభవంతో నాకు తెలిసింది చెప్పాను. నీకు నచ్చినట్టు నువ్వు చేయొచ్చు. కాకపోతే, తెరపై ఈ సన్నివేశం చూసిన తర్వాత… ముందే ఎందుకు చెప్పలేదని మాత్రం నన్ను అడగొద్దు’ అని షారూక్ బదులివ్వడంతో, అప్పటి నుంచి ఆయనకు ఎదురు చెప్పలేదంటూ మహీరా ఖాన్ గుర్తు చేసుకుంది.

ADVERTISEMENT

షారుక్ తో కలిసి పనిచేయడంతో చాలా విషయాలు తెలుసుకున్నానని, అందరితో కలిసిపోయే ఆయన, చాలా తెలివైన వాడు అని మహీరా కితాబ్ ఇచ్చింది. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా, షారుక్ వైభవానికి నిదర్శనంగా నిలుస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Vishwambhara vs Kaaka: Why UV Creations Still Silent?

Confusion over Chiranjeevi’s Sankranthi releases is growing, but UV Creations continues to remain silent. While…

14 minutes ago

AOT Radhe Unplugged: DQ Surprises With His Singing

Dulquer Salmaan has sung an unplugged version of the Radhe Radhe song from Aakasamlo Oka…

24 minutes ago