
గోవా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైంది. ప్రభుత్వ ఏర్పాటులో పార్టీ ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ ఘోరంగా విఫలమయ్యారని, పార్టీకి భారంగా మారిన నేతలను వదిలించుకోవాలని రాహుల్ నిర్ణయించినట్టు జన్ పథ్ వర్గాలు చెబుతున్నాయి. చికిత్స కోసం విదేశాలకు వెళ్లి ఇటీవల భారత్ తిరిగొచ్చిన పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో రాహుల్ ఈ విషయమై ఇప్పటికే చర్చించినట్టు తెలుస్తోంది.
వీలైనంత త్వరగా కొత్త కార్యవర్గాన్ని నియమించాలని భావిస్తున్న అధిష్ఠానం.. పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు సహా పార్టీ అనుబంధ విభాగాలకు ఈ సారి కొత్త వారిని ఎంపిక చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా రాహుల్ తన సొంతం టీంతో సర్వే సైతం నిర్వహించినట్టు తెలుస్తోంది. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న వారిని గుర్తించి పదవులు ఇవ్వాలన్న అభిప్రాయం సర్వేలో వ్యక్తమైంది. దీంతో భారీ మార్పులకు రాహుల్ సిద్ధమవుతున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక, రెండు తెలుగు రాష్ట్రాలకు ఇన్ చార్జ్ గా వ్యవహరిస్తున్న దిగ్విజయ్ సింగ్ కు ఉద్వాసన పలకాలని నిర్ణయించారు. దిగ్విజయ్ ను పక్కనపెట్టి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వేర్వేరుగా ఇన్ చార్జ్ లను నియమించాలని భావిస్తున్నారు. పార్టీ ప్రక్షాళన కంటే ముందే ఈ మార్పు ఉండే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. ఏపీ, తెలంగాణలకు ఇన్ చార్జ్ లను నియమించే ముందు రెండు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో రాహుల్ చర్చించనున్నట్టు సమాచారం.
Allari Naresh knows exactly what he wants from the audience this time that's laughter, not…
There is some fresh buzz around Chiranjeevi and Bobby Kolli’s Kaaka. According to industry gossip,…