
కొందరు వ్యక్తులు, కొన్ని విషయాలు చాలా మందికి బోర్ అనిపిస్తాయి. అటువంటిదే ఇది కూడా. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిన్న ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టి ‘హర్యానా ఫైల్స్’ పేరుతో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
హర్యానా రాష్ట్రంలో 2020లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఏ స్థాయిలో ఏవిదంగా దొంగ ఓట్లు పడ్డాయో సాక్ష్యాధారాలతో సహా వివరించారు.
ఒక్క హర్యానా రాష్ట్రంలోనే 25 లక్షలకు పైగా దొంగ ఓట్లు పడ్డాయని తెలిపారు. వాటిలో రెండు అంత కంటే ఎక్కువ చోట్ల ఓట్లు వేసినవారు 5.21 లక్షల మంది ఉన్నారు. మన దేశస్తులే కాదు… బ్రెజిల్ దేశానికి మోడల్ మాధ్యూస్ ఫెర్రో వివిద పేర్లతో 10 పోలింగ్ కేంద్రాలలో 22 సార్లు ఓట్లు వేశారంటూ ఆమె ఫోటోతో ఉన్న ఓటర్ కార్డులను మీడియాకు చూపారు.
ఇదివరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలలో కూడా ఇలాగే జరిగిందని చెప్పారు. అంతేకాదు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఈవిదంగా ఓట్ల చోరీ జరుగుతూనే ఉందని కనుక యువత మేల్కొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని రాహుల్ గాంధీ హెచ్చరించారు.
ఆయన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల కమీషన్ రెండూ ఖండించాయి. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని ఎన్నికలలో గెలిపించుకోలేక కేంద్రాన్ని, వ్యవస్థని నిందిస్తున్నారని బీజేపి నేతలు విమర్శిస్తున్నారు.
రాహుల్ గాంధీ వంటి సీనియర్ నాయకుడు ఎన్నికల వ్యవస్థ, యంత్రాంగంపై అనుమానాలు రేకెత్తించేలా ఆరోపణలు చేస్తూ తమ విశ్వసనీయతని దెబ్బ తీయడం సరికాదని కేంద్ర ఎన్నికల కమీషన్ అభిప్రాయపడింది.
కానీ రాహుల్ గాంధీ బయటపెట్టిన ఈ అక్రమాలు, నకిలీ ఓటర్లు నిజమే అయితే ఇది మన ప్రజాస్వామ్య వ్యవస్థను చెద పురుగులా లోపల నుంచి తొలిచేస్తూనే ఉంటుంది. కనుక ఏదో రోజున మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం పొంచి ఉంటుంది.
Unlike the usual approach seen in recent times, the makers of The Paradise have chosen…
Tamil cinema has not had a great run with big-ticket sequels. The first film works,…