
రైల్వే మంత్రి సురేష్ ప్రభు బడ్జెట్‌లో పేర్కొన్న హమ్ సఫర్, ఉదయ్, తేజస్, అంత్యోదయ రైళ్లను అక్టోబరు నుంచి దశల వారీగా పట్టాలెక్కించాలని రైల్వే నిర్ణయించింది. తిరుపతి-జమ్ముతావి మధ్య నడిచే ‘హమ్‌సఫర్’లో అన్ని కంపార్ట్ మెంట్‌లు థర్డ్ క్లాస్ ఏసీతో ఉంటాయి. సాధారణ రైలు చార్జీలతో పోలిస్తే ఇందులో టికెట్ ధర 20 శాతం అధికంగా ఉంటుంది. అయితే ఈ రైలులో వైఫై సౌకర్యం కూడా ఉంటుంది. వారంలో ఓ రోజు తిరుపతి నుంచి బయలుదేరే ఈ రైలు మార్గం మాత్రం ఇప్పటి వరకు ఖరారు కాలేదు.
ఇక విశాఖపట్నం-విజయవాడ మధ్య నడిచే ‘ఉదయ్’ డబుల్ డెక్కర్ ఏసీ రైలు. రద్దీ మార్గాల్లో రాత్రి వేళల్లో బయలుదేరి ఉదయానికి గమ్యస్థానం చేరుకోవడంమే ఈ రైలు లక్ష్యం. అయితే విజయవాడ-విశాఖపట్నం మధ్య ఏ వేళలో తిప్పాలన్న దానిపై ఇప్పటి వరకు అధికారుల్లో స్పష్టత లేదు. ఇక ఏపీ మీదుగా ప్రయాణించే కొత్త రైళ్లలో చెన్నై-అహ్మదాబాద్, హౌరా-యశ్వంత్‌పూర్, కామాఖ్య-బెంగళూరు, సంత్రగచ్చి-చెన్నై, హౌరా-ఎర్నాకుళం రైళ్లు కూడా ఉన్నాయి. తాజా పరిణామాలతో ఏపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన సురేశ్ ప్రభు పూర్తి న్యాయం చేస్తున్నారన్న టాక్ పొలిటికల్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…