
ప్రవాస భారతీయుడైన తిరుసెల్వన్ తాజాగా ‘లేక్ ఆఫ్ ఫైర్’ అనే హాలీవుడ్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా తిరుసెల్వన్ మాట్లాడుతూ… తాను రెండు కథలను తయారుచేశానని, అందులో ఒకటి తమిళ రాజకీయాల గురించి అని తెలిపారు. రాష్ట్రంలో రెండు పార్టీలే మార్చి మార్చి అధికారంలోకి ఎందుకు వస్తున్నాయి? దానికి కారణం ఏమిటి? వీటి వెనక ఉన్నదెవరు? తదితర వాస్తవాలతో అజిత్ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు పేర్కొన్నారు. ఇందుకోసం చర్చలు జరుగుతున్నాయన్నారు.
అలాగే ఓ పూర్తి ప్రేమ కథను సిద్ధం చేసినట్టు తిరుసెల్వన్ తెలిపారు. ఇందులో హీరోగా విజయ్ నటిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కోలీవుడ్ లో విజయ్ చాలా సాధించాడని, హాలీవుడ్‌లో అరంగేట్రానికి ఈ చిత్రం దోహద పడుతుందని రాజ్ తిరు సెల్వన్ పేర్కొన్నారు. ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్న వీరిద్దరూ రాజ్ తిరుసెల్వన్ ప్రతిపాదనకు అంగీకరిస్తారా… అన్న విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
The Congress leadership took the tough call of firing Konda Surekha from her Cabinet position…
Vyjayanthi Movies, the producers of Kalki 2898 AD, have issued an official warning about fake…