Telugu

‘బలహీనుడి బలమే’ ఈ రాజధాని ఫైల్స్..!

ప్రభుత్వాలు మారడంతో కొన్ని తరాల భవిష్యత్ తలక్రిందులవుతుందా..? అనే ప్రశ్నకు సమాధానం ఆంధ్రపద్రేశ్ రాష్ట్రంలో దొరుకుతుంది అని నిరూపించారు వైసీపీ ప్రభుత్వం. ఏపీ రాజధాని ప్రాంతమైన అమరావతికి అతి సమీపంలో ఉన్న తాడేపల్లి లో ముఖ్యమంత్రి జగన్ ఒక ప్యాలెస్ నే కట్టుకున్నారు.

అయితే ఆ ప్యాలస్ లో అడుగు భూమి కాదుకదా కనీసం ఆ ప్యాలస్ దరిదాపులలోకి వెళ్లాలన్నా సామాన్యుడికే కాదు సినీ సెలబ్రెటీలకు సైతం షరతులు తప్పనిసరని నిరూపించారు ముఖ్యమంత్రి జగన్. అయితే తన నివాసానికి సంబందించిన భూమి పై తనకు అంత హక్కు, ప్రేమ ఉన్న ఉందని నిరూపించిన జగన్ అదే హక్కు, ప్రేమ రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు కూడా ఉంటుందని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారో..?

ADVERTISEMENT

ఒక్క జగన్ మాత్రమే కాదు రాజధాని ప్రాంత రైతుల త్యాగాన్ని కించపరుస్తూ, వారిని పైడ్ ఆర్టిస్టులు అంటూ హేళన చేసిన, చేస్తున్న ఏ ఒక్కరైనా తమ సొంత కష్టార్జితంతో తమ పిల్ల భవిష్యత్తు కోసం సంపాదించిన భూమి నుండి ఒక్క అడుగు భూమినైనా వదులుకోవడానికి కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం త్యాగం చేయడానికి సిద్ధమా అనేది తమ మనఃసాక్షిని అడిగి తెలుసుకోవాలి.

అలా సిద్ధం అని వేల అడుగులు ముందుకు వేసి రాష్ట్ర ప్రభుత్వం కోసం నాలుగు పంటలు పండే దాదాపు 33 వేల ఎకరాల భూమిని అందరి బాగు కోసం ఒక ప్రభుత్వాన్ని నమ్మి అప్పగించారు అక్కడి రైతులు. ఇప్పుడు ఇదే వారు చేసిన అతి పెద్ద నేరంగా భావించి 2019 ఎన్నికల తరువాత కొత్తగా వచ్చిన వైసీపీ ప్రభుత్వం వారికి శిక్షగా జీవిత ఖైదు విధించిందనే చెప్పాలి. ఇటు తమ పంట పొలం తిరిగి వెనకకు రాదు అలా అని అది ప్రయోజనకరంగాను లేదు.

ఇటువంటి సెన్సిటివ్ ఇష్యు పట్టుకుని రైతుల కోణంలో వారి ఆవేదనను తెలుగు ప్రజలందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ రాజధాని ఫైల్స్ తెరకెక్కిందంటూ చిత్ర దర్శకుడు భాను మీడియా చిట్ చాట్ లో వివరించారు. ఈ సినిమాలో రైతులే హీరోలు, రైతులను హింసించిన వారే విలన్లు అంటూ చెప్పుకొచ్చారు. ఒకరి అహం నిలబెట్టుకోవడానికి అధికారం అనే కవచాన్ని అడ్డుపెట్టుకుని అధికారులతో సామాన్యుడి మీద ప్రభుత్వం చేస్తున్న యుద్ధమే ఈ రాజధాని ఫైల్స్ అంటున్నారు చిత్ర బృందం.

అయితే ఈ మీడియా ప్రశ్నా వలిలో వైసీపీ కి మద్దతుగా వచ్చిన, వస్తున్న సినిమాలలో జగన్, చంద్రబాబు, లోకేష్, పవన్ అంటూ నేరుగా పేరులు పెట్టి సినిమాలు తీస్తుంటే మీరేమో అరుణప్రదేశ్, అయిరావతి అంటూ పేర్లు మార్చడం వెనుక అంతరార్థం ఏమిటి అంటూ అడిగిన మీడియా వారికి బలహీనుడికి ఒకరకమైన న్యాయం , బలమైన వారికీ ఒకరకమైన న్యాయం ఉంటుంది కదా సార్ అంటూ బదులిచ్చారు చిత్ర దర్శకుడు.

ఇలా “ఒకరి అహాన్ని దెబ్బతీస్తూ వ్యూహం, శపథం అంటూ ఒకరు ముందుకొస్తుంటే”, “ఒకరి అహం వల్ల రాష్ట్రంలో జరిగిన విధ్వంసాన్ని చూపించడానికి” రాజధాని ఫైల్స్ తో మరొకరు ముందడుగు వేశారు. ఈ నెల 15 న రాజధాని ఫైల్స్…ఒక ప్రభుత్వ నిర్ణయం, కొన్ని రైతు కుటుంబాల త్యాగాలతో పురుడుపోసుకున్న రాజధాని…,మరో ప్రభుత్వ నిర్ణయంతో ఎలా సమాధి అయ్యిందో చెప్పడానికి థియేటర్ల ముందుకు వస్తుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Imran Khan Faces Exit Notice After Mumbai Protest

Actor Imran Khan is facing fresh controversy after taking part in a protest in Mumbai.…

36 minutes ago

Ram Charan Trusts Sukumar to Build RC17 His Way

Ram Charan is reportedly giving Sukumar complete freedom to shape their next collaboration, tentatively titled…

1 hour ago