
తన ట్విట్టర్ ఖాతాలో రాజమౌళి ఓ వీడియో పోస్ట్ చేసి, కన్నడలో మాట్లాడి ఈ చిత్రం విడుదలకు సహకరించాలని కోరారు. తనకు కన్నడ సరిగా రాదని, ఏవైనా తప్పులుంటే క్షమించాలని ప్రారంభించిన రాజమౌళి… ఎన్నో ఏళ్ల క్రితం సత్యరాజ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు సినిమాను అడ్డుకోవద్దని అన్నారు. సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, ఆయన వ్యాఖ్యలతో ‘బాహుబలి’ బృందానికి ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు.
‘బాహుబలి’ చిత్రం కోసం ఎంతో మంది నటీనటులు, టెక్నీషియన్స్ ఎంతో కష్టపడ్డారని, ఈ సినిమా విడుదలను అడ్డుకుంటే అందరూ నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. ‘బాహుబలి-1’ను ఆదరించినట్టుగానే కన్నడ ప్రేక్షకులు బాహుబలి-2ని కూడా ఆదరించాలని ఈ వీడియో ద్వారా కోరారు రాజమౌళి. అయితే ‘బాహుబలి 1’లో సత్యరాజ్ నటించిన విషయం గానీ, ఆ సినిమాకు జననీరాజనం పలికిన సమయంలో గానీ కన్నడిగులకు ఈ వ్యాఖ్యలు గుర్తుకు రాలేదా? అంటూ సోషల్ మీడియా వేదికగా రాజమౌళి వ్యాఖ్యలను బలపరుస్తూ ప్రశ్నిస్తున్నారు.
After the arrival of the Revanth Reddy government in Telangana, the food safety authorities have…
Happy Journey features an unusual ensemble led by seven female characters- Annapurnamma, Amani, Anchor Jhansi,…