Telugu

మహేష్ బాబుకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చిన రాజమౌళి

సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి కలిసి తీస్తున్న ‘SSMB29’ సినిమా గురించి టాలీవుడ్‌లో రోజుకో వార్త వైరల్ అవుతూ ఉంటుంది. ఈ చిత్రం ఒక గ్లోబల్ జంగిల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. షూటింగ్ షెడ్యూల్స్ వేగంగా జరుగుతున్నాయి. తాజాగా, రెండో షెడ్యూల్ పూర్తయిన తర్వాత మహేష్ బాబుకు రాజమౌళి నెల రోజుల సమ్మర్ హాలిడేస్ ఇచ్చారని సమాచారం. రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగింది. ఈ షెడ్యూల్‌లో మహేష్ బాబు, ప్రియాంకా చోప్రాలపై ఒక పాటను శంకరపల్లి శివార్లలో సెట్ వేసి చిత్రీకరించారు. షెడ్యూల్ పూర్తయిన తర్వాత మహేష్‌కు విశ్రాంతి కోసం నెల రోజుల సెలవులు ఇచ్చారు. ప్రతి వేసవిలో ఫ్యామిలితో వెకేషన్ కి వెళ్లే మహేష్ ఈసారి కూడా విదేశాలకు వెళ్లనున్నారు.

ADVERTISEMENT

‘SSMB29’ ఒక భారీ బడ్జెట్ చిత్రం, దాదాపు రూ. 1000 కోట్లతో నిర్మితమవుతోంది. మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఒడిశా, ఆఫ్రికా అడవి ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. హైదరాబాద్‌లో కాశీ నేపథ్యంలో సెట్‌లు నిర్మించారు. గతంలో మహేష్ సినిమాల పూజ కార్యక్రమాలకు హాజరు కాకపోయినా, ఈ చిత్రం కోసం జనవరి 2, 2025న జరిగిన పూజలో పాల్గొన్నారు. షూటింగ్ కోసం తన పాస్‌పోర్ట్‌ను రాజమౌళికి అప్పగించినట్లు ఓ ఫన్నీ వీడియోలో చూపించారు. షూటింగ్ అనుకున్న షెడ్యూల్స్ లో కంప్లీట్ అయితే 2027 లో థియేటర్లలో సందడి చేసే అవకాశం ఉంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

వారి ఆరాటం.. ప్రజాస్వామ్యం కోసమా. ఓటు బ్యాంకు కోసమా?

ఎస్ఐఆర్ పేరుతో దేశంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర ఎన్నికల కమీషన్‌ కలిసి నిర్వహిస్తున్నయా?…

3 minutes ago

So Many Rejections, Nani Must Be Cautious!

Nani's latest film The Paradise marked one of the most ambitious attempts of his career.…

31 minutes ago