Telugu

మహేష్ కోసం రాజమౌళి ఎందుకు త్యాగం చెయ్యాలి..?

సినిమా వాళ్లకు సెంటిమెంట్స్ చాలా ఎక్కువ. ముహూర్తం పెట్టిన నాటి నుండి టీజర్, ట్రైలర్ ఆఖరికి సినిమా రిలీజ్ డేట్ కూడా అంతా సెంటిమెంట్ ని ఫాలో అవుతూ ప్లాన్ చేస్తారు. ఒక్కో స్టార్ ఒక్కో సెంటిమెంట్ ఫాలో అవుతుంటారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఓ సెంటిమెంట్ ఉంది. తన సినిమా ఏదైనా సుదర్శన్ 35 MM లో రిలీజ్ చేయాల్సిందే. సుదర్శన్ 35 మహేష్ లక్కీ థియేటర్ అని అని చెబుతుంటారు.

మహేష్ నటించిన ఒక్కడు, మురారి, బిజినెస్ మెన్, పోకిరి, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఈ సినిమాలన్ని సుదర్శన్ 35 లోనే రిలీజై సూపర్ హిట్ సాధించాయి. అక్కడ రిలీజైన ఒకటి రెండు సినిమాలే మహేష్ కి నెగటివ్ రిజల్ట్స్ తెచ్చాయి. ఈ క్రమంలో వచ్చే గురువారం రాబోతున్న సర్కారు వారి పాట సినిమాని కూడా సుదర్శన్ 35 లో రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే ఇక్కడే ఓ పెద్ద చిక్కొచ్చి పడ్డది. ఆల్రెడీ ఆ థియేటర్ లో RRR సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. సినిమా 50 రోజులు కూడా ఆడకముందే అక్కడ నుండి తీసే ఛాన్స్ లేదు. 1000 కోట్లు వసూళు చేసిన RRR సినిమా హైదరాబాద్ మెయిన్ థియేటర్ లో 50 రోజులు ఛాన్స్ లేకపోవడం విచిత్రంగా ఉంటుంది . దీనిపై ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు.

ADVERTISEMENT

ఈ టైం లో మహేష్ పర్సనల్ రిక్వెస్ట్ తో సుదర్శన్ లో ఉదయం 7, 11 గంటల ఆటలు అది కూడా రెండు రోజులు ఆ థియేటర్ లో షోలు పడేలా చేస్తున్నారట. అసలు రాజమౌళి ఎందుకు మహేష్ కోసం ఇంత గ్యాగం చేయాలి అంటే RRR కోసం మహేష్ తన సినిమా రిలీజ్ వాయిదా వేసుకున్నారు. ఆ కారణం చేతనే RRR ఆడుతున్న థియేటర్ లో రెండు షోలకు సర్కారు వారి పాట రిలీజ్ ఛాన్స్ ఇస్తున్నారట.

అయితే దీనిపై కొందరు యాంటీ ఫ్యాన్స్ రాజమౌళి సినిమాకు భయపడి మహేష్ వెనక్కి తగ్గాడు అంతే తప్ప అందులో ఆయన చేసిన త్యాగం ఏమి లేదని అంటున్నారు. సర్కారు వారి పాట కోసం RRR 50 రోజులు ఎందుకు వదుకోవాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అసలు మహేష్ సినిమాకు ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేనే లేదని దర్శకధీరుడు రాజమౌళి ఫ్యాన్స్ కూడా ఈ విషయంపై గుర్రుగా ఉన్నారు. ఇదిలాఉంటే సర్కారు వారి పాట థియేటర్ లిస్ట్ లో ఆల్రెడీ సుదర్శన్ 35 ని కూడా చేర్చారు అంటే రాజమౌళి, మహేష్ మధ్య డీల్ సెట్ అయినట్టే అని చెప్పొచ్చు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

SRK’s King Needs Rs. 500 Crores Just to Stay Safe?

King has locked its release for December this year. However, a major challenge has emerged…

10 minutes ago

TN Elections: Can Kamal Haasan Counter Vijay’s Rising Wave?

With only a few days left for the Tamil Nadu state elections, political parties are…

39 minutes ago