Telugu

నీరస వాతావరణంలో జోష్ నింపిన రాజమౌళి

గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో సినిమాలు లేక, సినిమా థియేటర్లు లేక, షూటింగులు లేక ఒకరకమైన నీరస వాతావరణం ఏర్పడింది. అయితే ఉగాది సందర్భంగా సినీ అభిమానులకు కొంచెం జోష్ ఇవ్వడానికి అంటూ ఎస్ఎస్ రాజమౌళి ఒక శుభవార్త చెప్పారు. రేపు ఆర్ఆర్ఆర్ టైటిల్ లోగో తో పాటు మోషన్ పోస్టర్ విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

అయితే అభిమానులు దీనిని తమ తమ ఇళ్ళల్లో కూర్చుని ఎంజాయ్ చెయ్యాలని ఎట్టిపరిస్థితులలో బయటకు రాకూడదని రాజమౌళి చెప్పారు. అదే విధంగా తమ టీంలు అన్నీ ఇంటి నుండే పని చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ వల్ల ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఇప్పటికే ఆగిపోయింది.

ADVERTISEMENT

ఈ చిత్రాన్ని తాజాగా జనవరి 8, 2021న సంక్రాంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చెయ్యనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. అయితే షూటింగ్ ఆలస్యమైన కారణంగా సినిమా వాయిదా పడొచ్చు అని పుకార్లు షికార్లు చేస్తున్నారు. రేపు దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు మరియు ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తుంది. ఇక ఎన్టీఆర్ సరసన ఒక హాలీవుడ్ తార కనిపించబోతుంది. మరో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించబోతున్నారు. ఇప్పటికే ఆయన ఈ సినిమా కోసం కొన్ని రోజులు షూటింగ్ లో పాల్గొన్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

GG’s Hyderabad Star Experiment Backfires: Fans React

Gautam Gambhir and the Indian team management faced questions after their decision to send Tilak…

2 hours ago

If Sandeep Gives Up, Prabhas In Trouble?

Prabhas might be one of the biggest superstars in Indian cinema, but there have been…

3 hours ago