
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమాకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారన్న వార్త పాతదే. ఇదిలా ఉంటే దానయ్య బ్యానర్ తర్వాత కేఎల్ నారాయణ నిర్మాణంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తదుపరి చిత్రం ఉంటుందని రాజమౌళి ఇప్పటికే స్పష్టం చేసారు. అయితే తాజాగా చక్కర్లు కొడుతున్న విషయం ఏమిటంటే… జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబుల కలయికలో ఓ మల్టీస్టారర్ సినిమాకు రాజమౌళి రూపకల్పన చేస్తున్నారని ఓ హాస్యాస్పదమైన పుకారు షికారు చేస్తోంది. అంటే ఒక దెబ్బకు రెండు పిట్టలన్నమాట!
గత రెండు, మూడు రోజులుగా టాలీవుడ్ కు సంబంధించి వృతికా శేరు, అక్కినేని అఖిల్ ల గురించి సోషల్ మీడియాలో హల్చల్ చేసిన ఫేక్ న్యూస్ గురించి తెలిసిందే. అదే కోవలోకి రాజమౌళి సినిమాకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ చేరిందని చెప్పాలి. ఎన్టీఆర్ హీరోగా చేస్తారన్న విషయమే ఖరారు కాకపోగా, దీనికి మహేష్ పేరు జత కట్టడం కేవలం కామెడీ సృష్టించడానికే అని చెప్పాలి. ఇదిలా ఉంటే, అల్లు అర్జున్ తో చేయాలని మెగా కాంపౌండ్ నుండి జక్కన్నపై తీవ్ర ఒత్తిడి వస్తున్నట్లుగా ట్రేడ్ వర్గాలలో మరో వార్త చక్కర్లు కొడుతోంది.
తెలంగాణ అధికార పార్టీ లో కొండా సురేఖ వివాదం ఆరని చిచ్చు మాదిరి అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని ఇబ్బంది…
Fans finally have a major update on Dragon, the much-awaited collaboration between Jr. NTR and…