Telugu

‘కబాలి’ బ్యాక్ టు ఇండియా… విత్ ఫుల్ జోష్..!

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘లింగా’ సినిమా దారుణ పరాజయం పాలైన విషయం తెలిసిందే. అలాగే భారీ అంచనాలతో విడుదలైన ‘కబాలి’ కూడా ప్రేక్షకుల నుండి సరైన స్పందనను తెచ్చుకోలేకపోయింది. కానీ, ఈ రెండు సినిమాలకు ఓ తేడా ఉంది. అవే సినిమా కలెక్షన్స్. ‘కబాలి’ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ, వసూళ్ళ విషయంలో సరికొత్త రికార్డులు నమోదు కావడంతో… సూపర్ స్టార్ ఫుల్ జోష్ లో కనపడుతున్నారు.

అదే ఈ ఫోటోలో కనపడుతోంది కూడా! ఇప్పటివరకు వైద్యం నిమిత్తం అమెరికాలో చికిత్స తీసుకున్న రజనీకాంత్, సినిమా విడుదలను కూడా అమెరికాలోనే ఎంజాయ్ చేసారు. విడుదలకు ఒక రోజు ముందే స్పెషల్ స్క్రీనింగ్ వేయించుకున్న రజనీ, ‘కబాలి’ విడుదలైన రోజు మాత్రం ఎక్కడా తారసపడలేదు. అయితే, యుఎస్ నుండి చెన్నై బయలుదేరిన సమయంలో మాత్రం… ఇలా హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఎయిర్ పోర్టులో ‘టాటా’ చెప్తున్నారు.

ADVERTISEMENT

‘కబాలి’ ప్రేక్షకుల టాక్ రజనీకి తెలిసే ఉంటుంది. అలాగే వసూళ్ళ విషయం కూడా! కనీస ఓపెనింగ్స్ ని కూడా రాబట్టడంలో ‘లింగా’ ఫెయిల్ కాగా, అదే విషయంలో ‘కబాలి’ సక్సెస్ కావడంతో డిస్ట్రిబ్యూటర్లు కొంతమేరకు ఊపిరి పీల్చుకున్నారు. యుఎస్ లో అయితే ఇప్పటికే లాభాల జోన్ లోకి వెళ్ళిపోగా, ఇతర ప్రాంతాలలో ఈ వీకెండ్ తో పెట్టిన పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నారు. దీంతో ‘తలైవర్’ కూడా ప్రశాంతంగా పాటలు వింటూ ఇండియాకు బయలుదేరారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

CBN Drops Good News On Teachers Day!

Today, September 5 happens to be teachers Day and Andhra Pradesh chief minister Chandrababu Naidu…

5 minutes ago

Rashmika: A Better Inspiration for Anand Than Vijay D?

The interesting part of the Epic trailer launch was not just Vijay Deverakonda’s absence and…

34 minutes ago