
అలా ఈ సీజన్ సెలబ్రిటీల విడాకుల ముహుర్తాలకు ఫిక్స్ అయినట్లుగా కనపడుతోంది. టాలీవుడ్ క్యూట్ కపుల్ గా కీర్తిని అందుకున్న చైతూ – శ్యామ్ ల బ్రేకప్ టాలీవుడ్ వర్గాలలో ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉండగా, తాజాగా తమిళ హీరో ధనుష్ మరియు సూపర్ స్టార్ రజనీకాంత్ తనయురాలు ఐశ్వర్యల విడాకుల ప్రకటన వెలువడింది.
18 ఏళ్ళ పాటు కొనసాగిన వివాహ బంధం తర్వాత ధనుష్ – ఐశ్వర్యలు విడిపోవడానికి గల కారణాలు ఏమిటో స్పష్టంగా చెప్పలేదు గానీ, ఈ సమయంలో తమకు కొంత ప్రైవసీ ఇవ్వాల్సిందిగా మీడియాను కోరారు హీరో ధనుష్. తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగిన ధనుష్ మరియు సూపర్ స్టార్ రజనీ అభిమానులకు ఇది చేదు వార్తే.
ఇదిలా ఉండగా, మెగాస్టార్ చిరంజీవి రెండవ తనయురాలు శ్రీజ మరోసారి తన దాంపత్య జీవితానికి ‘శుభంకార్డు’ వేసిందా? అంటే అవుననే సమాధానం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో శ్రీజ వ్యక్తిగత ఖాతాకు పెట్టుకున్న ‘సింగిల్ స్టేటస్’ ఇందుకు నిదర్శనంగా కనపడుతోంది. పరోక్షంగా తన డైవర్స్ ప్రకటనను శ్రీజ చెప్పకనే చెప్పిందనేది ఈ స్టేటస్ సారాంశం.
గతంలో శిరీష్ భరద్వాజ్ ను ప్రేమించి, ఇంటి నుండి వెళ్ళిపోయి ఆర్య సమాజ్ లో వివాహం చేసుకోవడం, అప్పట్లో ఈ వివాహంపై టీవీ9 హంగామా చేయడం… ఆ తర్వాత చిరంజీవి పడిన మనోవేదనగా “పరుగు” సినిమా రూపాంతరం చెందడం… ఇలా శ్రీజ మొదటి వివాహం ఎపిసోడ్ మీడియా వేదికగా సంచలనం అయిన విషయం తెలిసిందే.
గతాన్ని మరిచి 2016లో మెగా కుటుంబం అంతా కలిసి కళ్యాణ్ దేవ్ తో అంగరంగ వైభవంగా శ్రీజ రెండవ వివాహం జరుగగా, అల్లుడిని ‘విజేత’గా మెగా ఫ్యామిలీ తెలుగు తెరకు పరిచయం చేసింది. కానీ తాజాగా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సూపర్ మచ్చి’ సినిమా వైపు మాత్రం కన్నెత్తి కూడా చూడకపోవడంతో మెగా కుటుంబం కళ్యాణ్ ను పక్కన పెట్టిందని స్పష్టమైంది.
ఒకే రోజు ఓ వైపు టాలీవుడ్ మెగాస్టార్ తనయురాలు… మరోవైపు కోలీవుడ్ సూపర్ స్టార్ తనయురాలు… విడాకుల ప్రకటనలు రావడం కాకతాళీయమే. సమాజంలో ఓ గొప్ప హోదాలో ఉన్న వ్యక్తులుగా చిరంజీవి మరియు రజనీకాంత్ లకు వ్యక్తిగతంగా ఈ పరిణామాలు కొంత ఇబ్బందికరమేనని పేర్కొనవచ్చు. ఎంత గొప్ప వారైనా… వారు కూడా మానవ మాత్రులే కదా..!
Nani and OG director Sujeeth have teamed up for Bloody Romeo, a stylish action film…
A H-1B tech worker's post on Reddit, where she plans for the future amidst layoffs…