Telugu

చిరు, పవన్ ఫెయిల్… రజనీ అయినా..?

మరికొద్ది గంటల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం “కాలా” విడుదల కాబోతోంది. కానీ ఎక్కడా రజనీ మేనియా గానీ, ఆ ఫీవర్ గానీ కనపడడం లేదు. ముఖ్యంగా తెలుగునాట అయితే సూపర్ స్టార్ హంగామా అస్సలు కనిపించడం లేదు. బహుశా రజనీ గత చిత్రాల ఫలితాల ప్రభావమో లేక ఈ సినిమా ప్రమోషన్స్ ఆకట్టుకోకపోవడమో గానీ, “కాలా” సినిమాపై ప్రేక్షకులు ఎలాంటి అంచనాలు పెట్టుకోలేదు. సోషల్ మీడియాలో కూడా పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఏమీ లేదు.

అయితే ఇదే రజనీకి సక్సెస్ ను తెచ్చిపెడుతుందా? ఏమో ఇటీవల సినిమాల ఫలితాలను చూస్తుంటే ఈ సారి సూపర్ స్టార్ బాక్సాఫీస్ వద్ద ప్రభావితం చూపే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే లో బజ్ లో వచ్చిన ‘రంగస్థలం, భరత్ అనే నేను’ సినిమాలు కనకవర్షం కురిపించగా, వరుస సక్సెస్ లతో ఉన్న బన్నీ ‘నా పేరు సూర్య’ తిరగబడింది. అంటే అంచనాలు లేని సినిమాలు బాక్సాఫీస్ వద్ద మన్నగలుగుతున్నాయి. మరి రజనీ విషయంలోనూ ఇది రిపీట్ అవుతుందో లేదో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

ADVERTISEMENT

ఓపెనింగ్స్ వరకు అయితే సూపర్ స్టార్ రేంజ్ ఎక్కడా కనిపించడం లేదు. బహుశా టాక్ వస్తే ఉధృతి పెరుగుతుందేమో చూడాలి. ఇదిలా ఉంటే త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడుతుండడంతో తమ అభిమాన హీరో బొమ్మ బాక్సాఫీస్ వద్ద అదిరిపోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. చిరు ‘శంకర్ దాదా జిందాబాద్,’ పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ విషయంలో దారుణంగా ఇది బెడిసికొట్టగా, కనీసం రజనీ అయినా అభిమానులకు కావాల్సిన ఆ ఊపును తెప్పిస్తారో లేదో చూడాలి.

ఈ సినిమా తర్వాత రజనీకి ‘రోబో 2.0’ ఉన్నప్పటికీ, అది అభిమానులను అంతగా ఆకట్టుకునే సినిమా కాదు. రజనీకి మాస్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ మాస్ ను ఖచ్చితంగా మెప్పించాలి అంటే “కాలా”నే కరెక్ట్. ‘రోబో’కు ముందు, ఆ తర్వాత సక్సెస్ దాహంతో ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్ కు ఫీస్ట్ అయ్యే సినిమాగా “కాలా” నిలవాలని ఆశిద్దాం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Muntashir’s ‘Qawwalis’ Jibe: A Dig at Ramayana?

The Ramayana song Mangal Rang has unexpectedly brought Adipurush back into the conversation. When the…

40 minutes ago

కాంగ్రెస్ పార్టీకి బిజెపి రిటర్న్ గిఫ్ట్ రెడీ చేస్తోందా?

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్)పై కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు చేసి మోడీ…

45 minutes ago