Telugu

భయంకరమైన పోస్టర్ తో ‘కబాలి’

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘కబాలి’ ఈ నెల 22వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. దీంతో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా చిత్ర బృందం తాజాగా ఒక పోస్టర్ ను విడుదల చేసారు. హనుమంతుడి గుండెలు చీలిస్తే రాముడు కనపడినట్లు… కబాలి గుండెల్లో హీరోయిన్ రాధిక ఆప్టే కనిపించే పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

ADVERTISEMENT

అయితే ఈ పోస్టర్ డిజైన్ అంతా కూడా ఓ హార్రర్ సినిమా మాదిరి దర్శనమివ్వడం విశేషం. ‘కబాలి’ అనేది పక్కా మాస్ అండ్ కమర్షియల్ అంశాలతో తెరకేక్కిందన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన పబ్లిసిటీ కూడా ఇదే తరహాలో సాగింది. డాన్ గా ‘కబాలి’ ఫస్ట్ లుక్ నుండి మొన్నటి టైటిల్ సాంగ్ వరకు అంతా కమర్షియల్ ఫార్మాట్ లో సాగింది. అయితే విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది పబ్లిసిటీలో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అందులో భాగంగా ఇలాంటి భయంకరమైన బాగుండే పోస్టర్లు వస్తున్నాయి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

అరడజను సినిమాలు వచ్చాయి.. సందడి మాత్రం రాలేదు!

ఈ వారం తెలుగు, ఇతర భాషలు కలిపి దాదాపు అరడజను సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. సంఖ్య బాగానే ఉన్నా, ఒక్క…

42 minutes ago

Pakistan Players Mocked Earlier? Now Rohit? Fans Speechless

Rohit Sharma is making his television debut with Sony TV’s new show Family Full House…

53 minutes ago