Telugu

సూపర్ స్టార్ ‘గ్రీన్’ సిగ్నల్స్… సర్వత్రా ఉత్కంఠ..!

దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత వరుసగా అభిమానులతో భేటీలు నిర్వహించడంతో… రజనీకాంత్ వేస్తున్న అడుగులపై తమిళనాడు ఉత్కంఠగా ఉంది. ముఖ్యంగా జయలలిత మరణం తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితుల రీత్యా, రాజకీయ శూన్యత ఏర్పడడంతో అందరి చూపులు రజనీకాంత్ వైపుకు మళ్ళాయి. అయితే గతంలో ఎప్పుడు రాజకీయాల గురించి ప్రస్తావించినా… ‘తానూ రాజకీయాలకు దూరం అంటూ కుండబద్దలు కొట్టినట్లు వ్యాఖ్యానించే’ రజనీ స్వరంలో మార్పు వచ్చింది.

ADVERTISEMENT

ప్రస్తుతం అంతా దేవుడి పైన భారం వేస్తున్నారు. ‘అరుణాచలం’లో సూపర్ స్టార్ చెప్పిన డైలాగ్స్ మాదిరి ‘దేవుడు ఆదేశిస్తే రజనీ పాటిస్తాడు’ అన్న స్థాయిలో వ్యాఖ్యానించడం ప్రాధాన్యతను దక్కించుకుంది. అంతేకాదు రాజకీయాల్లోకి వస్తే డబ్బుల కోసం కక్కుర్తి పడే వారిని చేరనివ్వనని రజనీ చెప్పడం అంటే… ప్రస్తుతం ఉన్న పార్టీలను పక్కన పెట్టి, కొత్త పార్టీని రజనీ స్థాపించబోతున్నాడు అనే ప్రచారం బలపడింది. అలాగే రజనీ తమిళ వ్యక్తి కాదు అంటూ చెలరేగిన విమర్శలకు కూడా తాజాగా గట్టిగా బదులిచ్చాడు రజనీ.

తమిళులకు ప్రాంతీయ ప్రేమ ఎంత ఉంటుందన్నది దేశం మొత్తానికి తెలిసిన విషయమే. దీంతో కాబోయే తన ప్రాంతీయతపై పుకార్లు గానీ, ప్రత్యర్ధులకు మరో అవకాశం ఇవ్వడం గానీ లేకుండా దీనిపై స్పష్టత ఇచ్చారు. 40 సంవత్సరాలుగా తమిళనాడులో ఉంటున్నాను, నేను తమిళ వ్యక్తినే అంటూ స్పష్టత ఇచ్చారు. జరుగుతున్న పరిణామాలన్నీ రజనీ పొలిటికల్ ఎంట్రీ ‘సిగ్నల్స్’ను అభిమానుల్లోకి, ప్రజల్లోకి పంపిస్తోంది. అంతేకాదు, వ్యవస్థలో లోపాలు ఉన్నాయని, చెడు రాజకీయ నేతలతో పాటు నలుగురు మంచి నాయకులు కూడా ఉన్నారని చెప్పడం… పరోక్షంగా ఇతర రాజకీయ పార్టీలకు సంకేతాలు పంపించడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే రజనీపై ఇంతగా ఫోకస్ చేయడానికి కారణాలు లేకపోలేదు. దేశంలో ఏ హీరోకు లేని విధంగా 80 వేల అభిమాన సంఘాలు రజనీ సొంతం. అలాగే సూపర్ స్టార్ అంటే పడిచచ్చే కుర్రకారే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఉన్నారు. దీంతో హీన పక్షంగా వేసినా 50 శాతం ఓటర్లు రజనీ వైపు ఉంటారనేది కీలకమైన విశ్లేషణ. అలాగే ప్రస్తుతం తమిళనాడులో ఉన్న రాజకీయ శూన్యత కారణంగా ఈ సంఖ్య అంతకంతకూ పెరిగేదే గానీ, తగ్గేది కాదు అనేది కూడా అసలు కారణం. అందుకోసమే రజనీ తీసుకునే నిర్ణయం కోసం ఒక్క అభిమానులే కాదు, తమిళనాట రాజకీయ పార్టీలన్నీ నిరీక్షిస్తున్నాయి. మరి సూపర్ స్టార్ ప్రకటన ఎప్పుడు ఉంటుందో వేచిచూడాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Romanchakam Review: U.S. Premiere Report

#Romanchakam Review: Thin Story, Patchy Laughs Romanchakam has a wafer-thin story and relies heavily on…

4 hours ago

Ravi Teja Gave More Confidence To Jr NTR?

Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…

8 hours ago