
ఇందుకు సంబంధించిన ఆడియో టేపులను ఓ ఛానల్ ప్రసారం చేయగా, మరికొందరు ఆటగాళ్లు కూడా అక్రమ్‌పై ఆరోపణలు చేశారు. ఉత్తరప్రదేశ్ క్రికెట్ సంఘం (యూపీసీఏ)లో అక్రమ్‌కు ఎలాంటి పదవి లేకపోయినా ఆటగాళ్ల ఎంపికలో చక్రం తిప్పుతున్నాడని పలువురు ఆటగాళ్లు ఆరోపించారు. ఫైవ్ స్టార్ హోటల్ కు అమ్మాయిని పంపిస్తే జట్టులో నీ పేరు ఉంటుందని అక్రమ్ హామీ ఇవ్వడం ఆడియో టేపులో స్పష్టంగా వినిపిస్తోంది.
ఆటగాళ్లు తనపై చేసిన ఆరోపణలను అక్రమ్ ఖండించాడు. రాహుల్ శర్మ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన బీసీసీఐ అక్రమ్ ను సస్పెండ్ చేసింది. ఆరోపణలపై యాంటీ కరప్షన్ యూనిట్ విచారణకు ఆదేశించింది. ఇప్పటికే సినీ రంగాన్ని కుదిపేస్తోన్న ‘కాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్’ వంటి అంశాలు, తాజాగా క్రికెట్ లోనూ ‘సెక్స్ ఫర్ సెలక్షన్’ పేరుతో వినిపించడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
Cyclone Arnab has made landfall near Narasapuram in Andhra Pradesh after approaching the coast south…
A variety of characters, conflicting desires, and different definitions of happiness form the foundation of…