
ముఖ్యంగా క్లైమాక్స్ లో తనకు సమంతకు మధ్య సన్నివేశాలు “రాజు గారి గది 2”కే హైలైట్ గా నిలుస్తుందని, చివరి 20 నిముషాలు చాలా ఆసక్తికరంగా ఉండి, ప్రేక్షకులను రక్తికట్టించడంలో సక్సెస్ అవుతుందని అన్నారు. సమంత, శీరత్ కపూర్… ఇద్దరికీ చాలా ప్రాధాన్యత ఉన్న రోల్స్ దక్కాయని అన్న నాగ్, ఈ సినిమా సక్సెస్ పట్ల పూర్తి విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. నాగచైతన్య పెళ్ళిపనుల్లో నిమగ్నం కావాల్సి ఉన్న నేపధ్యంలో… చివరగా ఈ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి పబ్లిసిటీ కార్యక్రమాలకు తెరలేపారు.
‘బాహుబలి 2’ తర్వాత సాధారణ విజువల్ ఎఫెక్ట్స్ ను తెలుగు ప్రేక్షకులు ఏ మాత్రం అంగీకరించడం లేదు అని చెప్పడానికి నిదర్శనంగా ‘స్పైడర్’ నిలిచింది. ఈ నేపధ్యంలో… వీఎఫ్ఎక్స్ నాణ్యత ఏ మాత్రం కాస్త అటుఇటుగా ఉన్నా అది సినిమాపై ప్రభావం చూపుతోంది. దీంతో ఈ విషయంలో తాను పూర్తి జాగ్రత్తలు తీసుకున్నాను అన్న భరోసాను సినీ ప్రేక్షకులకు ‘కింగ్’ కలిగించారు. నాగ్ కు సంతృప్తిగా ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ప్రేక్షకుల తీర్పు ఎలా ఉందో ఈ నెల 13వ తేదీన తేలనుంది.
Is Sivakarthikeyan finally answering the old Sardar vs Prince fan war, four years later? His…
ప్రతీ రాష్ట్రంలో అనేక సాగునీటి ప్రాజెక్టులు... వాటి కోసం ఓ శాఖ, మంత్రి, వాటి పర్యవేక్షణకు వందలాది మంది అధికారులు,…