
ఇంతకీ వీరు ఏం వీడియోలు పెట్టారో తెలుసా? న్యూయార్క్ ట్రిప్ లో ఉన్న రాఖీ సావంత్, తనకు ఓ భర్త దొరికాడంటూ ఓ వీడియోను పోస్టు చేయగా దాన్ని, దివ్యా స్పందన రీ పోస్ట్ చేశారు. ఈ వీడియోలో… ‘అందరూ తన భర్త ఎవరని అడుగుతున్నారని, ఇదిగో ఇతనే అంటూ ఒకరిని చూపింది. అతనితో కలసి న్యూయార్క్ లో తిరుగుతున్నానని, ఈ వీడియోను ప్రధాని మోడీ సహా అందరూ చూస్తుంటారని చెబుతూ… మోడీని ఉద్దేశించి “ఇదిగోండీ… ఈయనే మీ అల్లుడు” అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది రాఖీ. ఈ వీడియోను దివ్య 9వ తేదీన తన ట్విట్టర్ లో పెట్టారు. ఈ ట్వీట్ వైరల్ అయింది.
దీనికి సమాధానంగా స్పందించిన తేజ్ పాల్, సోనియాగాంధీకి ఓ కోడలు దొరికిందని చెబుతూ, అలహాబాద్ కు చెందిన ఓ మహిళ చేసిన ఆరోపణల వీడియోను పోస్టు చేశారు. రాహుల్ గాంధీ తన భర్తని సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె, తనను పెళ్లి చేసుకుంటానని ఆయన హామీ ఇచ్చారని, రోజూ కలలోకి వస్తుంటారని, చేసిన వాగ్దానాలను నిలుపుకోలేదని ఆరోపించింది. ఓబీసీనైన తనను పెళ్లి చేసుకుని దళితులపై ఉన్న ప్రేమను చూపాలని కోరిందా యువతి. ఈ పోస్టింగ్స్ జరిగి రెండు రోజులు గడిచినా, ఇంకా వైరల్ అవుతున్నాయంటే వీరి ట్వీట్ వార్ పొలిటికల్ వర్గాల్లో ఎంత హాట్ టాపిక్ అయ్యాయో అర్ధం చేసుకోవచ్చు.
Chiranjeevi’s ambitious fantasy film Vishwambhara is reportedly targeting a Sankranthi release on January 13, with…
Nitesh Tiwari’s Ramayana is arriving at the big screen on November 5, 2026. Expectations are…