
అవును… ఈ “రాక్షసి” ట్రైలర్ చూసి సినిమాకు వెళ్ళాలనుకుంటే… ఖచ్చితంగా భయపడాల్సిందే. ఎందుకంటే ధియేటర్ కు వెళ్ళిన ప్రేక్షకులు బుక్కవ్వడం ఖాయమన్న సంకేతాలను ఈ ట్రైలర్ ఇస్తోంది. రవిబాబు దర్శకత్వం వహించిన ‘అవును’ సినిమాల సిరీస్ ఫేం పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను భయపెట్టడం కన్నా, హార్రర్ కాబట్టి భయపడాలేమో అన్న అనుభూతులను కలిగిస్తుంది. పరమ రొటీన్ హార్రర్ సినిమాగా కనపడుతున్న ఈ ట్రైలర్లో నిర్మాణపు విలువలు కూడా లోపించాయి.
90 సెకన్ల పాటు సాగిన ట్రైలర్ ను చూడడమే, ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే విధంగా మారిన నేపధ్యంలో… ఇక 120 నిముషాలకు పైగా ఉండే సినిమాను భరించడం ప్రేక్షకులకు ఎంతవరకు సాధ్యం? ట్రైలర్ తో పాటు విడుదల చేసిన రెండు వీడియో సాంగ్స్ లలో కూడా నిర్మాణపు విలువలు పూర్తిగా లోపించాయన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఈ “రాక్షసి” సినిమా ప్రేక్షకుల పాలిట “రాక్షసి”గా మారుతుందేమో అన్న సంకేతాలను అయితే ట్రైలర్ కలిగిస్తోంది.
The latest season of the Bigg Boss Telugu TV show is going overboard, with contestants…
There was a time when Trivikram Srinivas was considered one of the most creative filmmakers…