
విచారణ సందర్భంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల ఇంటరాగేషన్‌లో దాదాపు 25 మంది సినీ ప్రముఖుల పేర్లు రియా బయటపెట్టినట్లుగా గత రెండు రోజులుగా మీడియాలో కథనాలు చూస్తున్నాం. ఇందులో బాలీవుడ్ భామల సారా అలీ ఖాన్, డిజైనర్ సైమోన్ కంబట్టాలతో పాటు టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నారని తెలుస్తోంది.
రకుల్ పేరు రావడం టాలీవుడ్ వర్గాలలో సంచలనం సృష్టిస్తుంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే గతంలో తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ వాడకానికి వ్యతిరేకంగా ఒక కాంపెయిన్ నిర్వహించింది. అందులో రకుల్ ని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకున్నారు. ఆ తరుణంలో ఇచ్చిన అనేక ఇంటర్వ్యూలలో రకుల్ డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలి అంటూ పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేసింది.
ఇప్పుడు ఆ క్లిప్పింగులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాములు పట్టే వాడు పాము కాటుకు బలి అయినట్టు ఉంది ఈ వ్యవహారం అంటూ పలువురు ఆక్షేపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. రకుల్ ఇప్పటివరకూ ఈ విషయంగా స్పందించలేదు. చూడాలి ఈ కేసు ఇంకా ఎటువంటి మలుపులు తిరుగుతుందో!
Following the failure of the recently released Kara, Dhanush is currently acting as the lead…
For decades, Aamir Khan built his reputation by going against mainstream Bollywood formulas. At a…