
అయితే మరోసారి చిరంజీవి – రామ్ చరణ్ ల కలయికను చూసేందుకు మెగా అభిమానులు సిద్ధం కావాల్సిన తరుణం ఆసన్నమైంది. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాలో చెర్రీ స్టెప్పులు వేసాడన్న విషయం ఇప్పటికే ఖరారైంది. అయితే ఏ పాటలో చిరు, చెర్రీల స్టెప్పులను కలిసి చూడవచ్చు అనే దానిపై తాజాగా స్పష్టత వచ్చింది. “ఖైదీ నంబర్ 150” మొదలైన కొద్దిసేపటికే సిల్వర్ స్క్రీన్ పై వచ్చే మెగాస్టార్ ఇంట్రడక్షన్ సాంగ్ లో వీరిద్దరూ కలిసి కన్నులవిందు చేయనున్నారని లభించిన కీలక సమాచారం.
దీంతో మెగా అభిమానులకు ఒక విధమైన హెచ్చరికలు జారీ చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ‘ఖైదీ నంబర్ 150’ ప్రారంభం మాత్రం మిస్ కావద్దు… ఒకవేళ మిస్ అయితే సినిమాను మరోసారి చూడాల్సి రావచ్చు… అని మెగా ఫ్యాన్స్ కు సూచనలు చేస్తున్నారు సినీ జనాలు. మొత్తానికి రెండు సార్లు తన సినిమాలో అతిథి పాత్రలు పోషించిన తండ్రి చిరంజీవి రుణాన్ని, కొడుకు చెర్రీ తిరిగి ఇచ్చేయబోతున్నాడన్న మాట.
Dulquer Salmaan’s latest Malayalam release I’m Game has exposed a worrying trend. Compared with the…
Allu Arjun’s Raaka has not received an official release date announcement from Sun Pictures yet.…