
అంతటి భారీ అంచనాలను అందుకోవడం సాధారణ విషయం కాదు. కానీ, రామ్ చరణ్ నటించిన మొదటి సినిమా ‘చిరుత’లో చెర్రీపై చిత్రీకరించిన ఇంట్రడక్షన్ షాట్, ఇప్పటివరకు పరిచయమైన సినీ హీరోలలో ‘ది బెస్ట్’గా పేర్కొనవచ్చు. ఈ క్రెడిట్ అంతా దర్శకుడు పూరీ జగన్నాధ్ కు వెళ్ళినా… ఆ ఐడియాకు మాత్రం అభిమానులు ఫిదా కాకుండా ఉండలేరు. తొలిసారిగా మెగాస్టార్ వారసుడ్ని ఎలా చూస్తామో అన్న అభిమానుల ఆతృతకు, దర్శకుడు పూరీ కడుపు నింపే విధంగా చిత్రీకరించారు.
రామ్ చరణ్ సినీ కెరీర్ తొమ్మిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సదరు ఇంట్రడక్షన్ షాట్ ను గుర్తు చేసుకుంటూ అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. బహుశా ఇలాంటి ఇంట్రడక్షన్ షాట్ మరే హీరో వారసుడికి దక్కుతుందని కూడా చెప్పలేనంతగా దర్శకుడు పూరీ తన క్రియేటివిటీని అంతా జోడించారు. ఒక్క మెగా అభిమానులే కాదు, దర్శకుడు పూరీ ప్రియులు కూడా ఈ సన్నివేశాన్ని విపరీతంగా అభిమానిస్తుంటారు. పూరీ పుట్టినరోజు సందర్భంగా… పూరీ కెరీర్ లో బెస్ట్ సీన్స్ లో ఇది ఒకటి అంటూ జగన్ ఫ్యాన్స్ కూడా హంగామా చేస్తున్నారు.
The term of the BR Naidu-led Tirumala Tirupati Devasthanams (TTD) governing board has come to…
Karthik Subbaraj’s Dorothy has found a new audience after its recent Netflix premiere. Despite receiving…