Telugu

ఇంతకీ… అతను చిరంజీవా… రామ్ చరణా..?

సైరా నరసింహారెడ్డి… మోషన్ పిక్చర్ అదిరిపోయింది… థమన్ బ్యాక్ గ్రౌండ్ ఇరగదీసేసాడు… ఇవి సోషల్ మీడియా వేదికగా మెగా అభిమానులు చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని, రెట్టించిన ఉత్సాహంతో పంచుకుంటున్న భావాలు. నిజమే… మోషన్ పిక్చర్ అంచనాలను మించి ఉంది. టైటిల్ కూడా పవర్ ఫుల్ గా ఉంది. ఫస్ట్ లుక్ అదిరింది. అంతా బానే ఉంది. అయితే ఈ మోషన్ పిక్చర్ లో వెనుక నుండి కనిపించిన వ్యక్తి ఎవరు? మెగాస్టార్ చిరంజీవా? మెగా పవర్ స్టార్ రామ్ చరణా?

ADVERTISEMENT

పోస్టర్స్ లో విడిగా చూసిన వాళ్లకు ఈ అనుమానం కలుగక మానదు. ‘మగధీర’ సినిమాలో రామ్ చరణ్ బాడీ ఎలా ఉందో, అలాగే ‘బద్రినాథ్’ మూవీలో అల్లు అర్జున్ ఏ విధంగా ఉన్నారో… దాదాపుగా ఆ రెండింటిని మిక్స్ చేస్తే… ఎలా ఉంటారో ఈ ‘సైరా నరసింహారెడ్డి’ పోస్టర్ లో ఉన్న వ్యక్తి అలా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవే అంతలా తగ్గారా? అంటే… బయట కనపడుతున్న చిరు బాడీకి, పోస్టర్ లో కనపడుతున్న బాడీకి సంబంధం లేకుండా ఉంది. బహుశా చెర్రీతో ఈ మోషన్ పిక్చర్ ను తయారు చేయించారేమో అన్న టాక్ వినపడుతోంది.

అలా కాకుండా ఈ పోస్టర్ లో ఉన్నది నిజంగా ‘మెగాస్టారే’ అయితే, అభిమానులకు కన్నులవిందు ఖాయం అని చెప్పవచ్చు. బహుశా హీరోయిన్ గా నటిస్తోన్న నయనతారను మించిపోయే స్థాయిలో మెగాస్టార్ లుక్ ఉండే అవకాశాలు ఉంటాయి. మరి ఈ సందేహానికి ‘కొణిదెల ప్రొడక్షన్స్’ నుండి జవాబు లభిస్తుందో లేదో చూడాలి. ఇక చిత్ర తారాగణం విషయానికి వస్తే, అమితాబ్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి వంటి ప్రముఖ తారాగణం అంతా ఇందులో కనువిందు చేయడానికి సిద్ధమవుతున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

15 Years Later, Panjaa Proves Pawan Craze Never Fades

Pawan Kalyan’s birthday has turned into a celebration on the big screen as Panjaa returns…

7 minutes ago

Devudichhina Annayya: Lokesh’s Hearty Wish To PK!

Pawan Kalyan was one of the individuals to firmly stand by the Chandrababu Naidu family…

43 minutes ago