
అయితే ఆర్ఆర్ఆర్ వాయిదా పడినట్టే అంటూ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ ఒక ట్వీట్ వేశారు. సౌత్ లోని ఒక బ్లాక్ బస్టర్ డైరెక్టర్ చేస్తున్న పెద్ద సినిమా ఇప్పుడు అక్టోబర్ లో విడుదల అవుతుంది. ఆ సినిమా ఏంటో చెప్పుకోండి అంటూ ఆయన ట్వీట్ చేశారు. చాలా మంది అది ఆర్ఆర్ఆర్ అనే ఫిక్స్ అయ్యారు. రాజమౌళి సినిమా వాయిదా పడటం అనేది సర్వసాధారణమే.
ఆర్ఆర్ఆర్ అక్టోబర్ కు వాయిదా పడటం అనేది జరిగితే…. గాంధీ జయంతి సందర్భంగా కానీ, దసరా సందర్భంగా కానీ విడుదల అయ్యే అవకాశం ఉంది. బాలీవుడ్ స్టార్స్ – అజయ్ దేవగన్, అలియా భట్ చిత్రబృందాన్ని కలవాల్సి ఉంది. వచ్చే షెడ్యూల్ లో వారు ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. దాదాపుగా 400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు డీవీవీ దానయ్య.
బాహుబలి తరువాత వచ్చే సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే వాటికి ఏమాత్రం తగ్గదని చిత్ర బృందం అంటుంది. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు మరియు ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఎన్టీఆర్ సరసన ఒక హాలీవుడ్ తార కనిపించబోతుంది.
Suriya’s long delayed project Karuppu, directed by RJ Balaji, is finally set for a worldwide…
The Tamil film industry must be very proud about the fact that one of their…