
సుకుమార్ అంటేనే క్రియేటివిటీకి పర్యాయపదం. అలాంటి సుకుమార్ పూర్తి స్థాయి గ్రామీణ వాతావరణం నేపధ్యంలో రామ్ చరణ్ హీరోగా పెట్టుకుని సినిమా చేస్తే… ఇదిగో ఈ పోస్టర్ లాగానే ఉంటుంది. లుంగీ ఎత్తి కట్టి కడవ పట్టుకుని బిందెలతో నీళ్ళు తెస్తున్నట్లుగా ఉన్న ఈ పోస్టర్ మెగా ఫ్యాన్స్ కు కావలసినంత కిక్ నిస్తోంది. లాంచనంగా నేడు ప్రారంభమైన ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది.
‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల హ్యాట్రిక్ చిత్రంగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. సుకుమార్ టీం అంతా మళ్ళీ ఈ సినిమా కోసం ఒక్కటయ్యారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా, రత్నవేలు ఫోటోగ్రఫీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుని ఈ ఏడాది దసరా కానుకగా సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…