Telugu

యాక్టర్ గా కన్నా నిర్మాతగా చెర్రీ సీరియస్!

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రంగప్రవేశం చేసిన రామ్ చరణ్ ఒక నటుడిగా ఇంకా నిరూపించుకోవాల్సింది చాలా ఉందన్న విషయం తెలిసిందే. ఓ పక్కన హీరోగా కొనసాగుతూ, మరో పక్కన తన తండ్రి 150వ సినిమా “ఖైదీ నంబర్ 150” ద్వారా నిర్మాతగా మారిన చెర్రీ, తాజాగా “సైరా నరసింహారెడ్డి”కి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన సమాచారం అంతా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు లీక్ అవుతున్న దరిమిలా, రామ్ చరణ్ సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది.

ADVERTISEMENT

స్వాతంత్ర్య సమరయోధుడు కధగా రూపొందుతున్న “సైరా నరసింహారెడ్డి” సినిమా విషయంలో ఎలాంటి లీకులు లేకుండా జాగ్రత్త వహించాలని ముందే చెప్పినప్పటికీ, ఇటీవల జగపతిబాబు పాత్రకు సంబంధించి ఓ లీక్ వచ్చింది. బ్రిటిషర్స్ సహకరించే వ్యక్తిగా సినిమాలో జగపతిది చాలా కీలక రోల్ అన్న సమాచారం సోషల్ మీడియాను చుట్టుముట్టిన విషయం తెలిసిందే. దీంతో సదరు సమాచారం ఎలా లీక్ అవుతుందంటూ సీరియస్ అయిన చరణ్, ఇకపై అలాంటివి పునరావృతం కాకుండా చూడాలని తన సన్నిహితులకు ఈ కార్యాన్ని అప్పగించినట్లుగా తెలుస్తోంది.

ఇండస్ట్రీలో ప్రస్తుతం ఈ లీకులు సర్వ సహజంగా మారిపోయాయి. క్రేజ్ ఉన్న ఏ సినిమాకైనా ఈ లీకుల బెడద తప్పనిసరిగా మారిపోయింది. అంతదాకా ఎందుకు… ప్రస్తుతం ఓ పక్కన తను హీరోగా చేస్తోన్న సినిమాలకు కూడా ఈ లీకులు తప్పడం లేదు. సుకుమార్ దర్శకత్వంలో చెర్రీ చేస్తోన్న “రంగస్థలం” సినిమా కూడా షూటింగ్ పిక్స్ కూడా లీకున పడిన విషయం తెలిసిందే. అయితే హీరోగా చేస్తున్న సినిమాల విషయంలో ఇప్పటివరకు రియాక్ట్ కాని చెర్రీ, నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా విషయంలో ఏ మాత్రం ఛాన్స్ తీసుకోవడం లేదని అర్ధమవుతోంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Laalo Telugu Remake: Ram Charan as Lord Krishna?

What happens when a Gujarati film made for around Rs 50 lakh turns into a…

11 minutes ago

Kichcha Sudeepa’s Action-Packed BRB 1st Look

Kichcha Sudeepa’s birthday celebrations get a high-octane touch with the arrival of an action-packed first…

39 minutes ago