
అవకాశం వస్తే ‘ఆకాశమే హద్దుగా’ చెలరేగిపోయే వర్మ, “గౌతమీపుత్ర శాతకర్ణి”ని ఉదహరిస్తూ… ‘ఖైదీ’ని ఏకరువు పెట్టారు. హే క్రిష్… నా జడ్జిమెంట్ సరైనదని నిరూపించే విధంగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాకు రోరింగ్ టాక్ వస్తున్నందుకు చాలా థ్రిల్లింగ్ గా ఉందని, బాలయ్యకు 100 ఛీర్స్. అరువు కధల కోసం ఆరాటపడకుండా, ఒరిజినల్ కధలతో తెలుగు సినిమాను గర్వంగా పైకి తీసుకెళ్ళినందుకు క్రిష్ కు, బాలయ్యకు సెల్యూట్ చేస్తున్నానని, పరోక్షంగా ‘ఖైదీ’ని ఒక ఆట ఆడేసుకున్నారు.
బాలకృష్ణ వందవ సినిమా 150 సార్లు మెగా అడ్వాన్స్ డ్ గా ఉందని, ‘బాహుబలి’ ప్రారంభించిన తెలుగు సినిమా ఖ్యాతిని ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మరింత ముందుకు తీసుకెళ్లిందని, ఇప్పటికైనా మెగా జనాలు అర్ధం చేసుకోలేని పక్షంలో ‘మెగా’ కాస్త ‘మినీ’ అయిపోతుందని… ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు మెగా కాంపౌండ్ ని మరోసారి హీట్ పుట్టిస్తాయని చెప్పడంలో తప్పులేదు. మరి ఈ సారి ఎవరు రియాక్ట్ అవుతారో గానీ, వర్మ మాత్రం మెగాస్టార్ “ఖైదీ”పై దండయాత్ర ప్రారంభించినట్లే కనపడుతోంది.
Manjari Fadnnis is setting screens ablaze with a spellbinding beachside photoshoot drenched in pure golden…
After the back to back failures of Jolly O Gymkhana and Badass Ravi Kumar, Prabhu…