పిక్ టాక్ : ఏంటీ ఈ జనాలు! హీరోకైనా ఉంటుందా?

సంచలన దర్శకులు వర్మ విజయవాడలో అడుగుపెట్టి దాదాపుగా 24 గంటలు కావస్తోంది. ఏ పని మీదైతే బెజవాడ వచ్చారో సైలెంట్ గా ఆ పని కానిస్తున్నారు వర్మ. ఉదయం నుండి వరుసగా కర్నాటి రామ్మోహనరావు, దేవినేని నెహ్రూలతో భేటీలవుతూ తన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటున్నారు. అయితే వర్మ విజయవాడ విచ్చేసిన సందర్భంగా వర్మకు ఘనస్వాగతం పలికిన జనసందోహం పట్ల అందరూ ఆశ్చర్యచకితులవుతున్నారు.

నిజంగా ఒక పెద్ద హీరో విచ్చేసిన సమయంలో కూడా ఇంత భారీగా అభిమానులు ఘనస్వాగతం పలుకుతారో లేదో గానీ, వర్మ రాక కోసం చేసిన ఏర్పాట్లు అవాక్కయ్యేలా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. అలాంటి సర్క్యులేట్ అవుతున్న ఫోటోలలో… రామవరప్పాడు సెంటర్ లో కారు ఆగిన సమయంలో వర్మ కారుకు అభిమానులు పూలభిషేకం చేస్తున్న ఈ బొమ్మ బాగా సందడి చేస్తోంది.

ADVERTISEMENT

వర్మకు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ లేదన్న విషయం తెలిసిందే అయినా… వంగవీటి వర్గీయులో, దేవినేని అనుచరులో దీని వెనుకున్నారని పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సందర్భంగా వంగవీటి – దేవినేని కుటుంబాలకు విజయవాడ రాజకీయాలలో ఉన్న ప్రాధాన్యత ఏమిటో మరోసారి తెలిసి వచ్చినట్లయింది.

Share
Akhil

Akhil, a passionate young writer, started his journey at M9 News and has since become a key member of the team. With a deep love for Telugu cinema, Hyderabad city news, and a keen interest in general affairs, Akhil br…

Published by

Recent Posts

CR7 Quits! Fans Lose Another GOAT

Another sporting legend has said goodbye to international sport. Cristiano Ronaldo has announced his retirement…

38 minutes ago

చొక్కా మడత పెట్టడం అంటే ఓటు వేయకపోవడమేనా.?

ఓటు ఒక దేశ భవిష్యత్, ఓటు ఒక నాయకుడి మీద నమ్మకం, ఓటు ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు...ఆ హక్కును వినియోగించుకోవడం…

54 minutes ago