Telugu

టాప్ దర్శకుడిపై ఎటాక్… క్లైమాక్స్ లో ట్విస్ట్..!

అండర్ వరల్డ్, ఫ్యాక్షనిజం, రౌడీయిజం వంటి క్లిష్టమైన కధలతో సినిమాలను తెరకెక్కించే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మపై ఓ ఎటాక్ జరిగిన విషయం తెలుసా? అంతేకాదు దానికి భయపడిన వర్మ, ఏకంగా పరుగులు కూడా పెట్టారు. దీనికి సంబంధించిన వివరాలను తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వర్మ వివరించారు. ముంబైలో ఎనిమిదవ ఫ్లోర్ లో ఓ ఫ్లాట్ ఉండేవాడ్ని. తాను బయటకు వచ్చే సమయానికి ఎప్పుడు రెడీగా కారు, ఓ సారి లేదని, అటు వైపుగా చూస్తే ఓ వ్యాన్ ఆగి ఉంది, ఆ వ్యాన్ లో కొంతమంది తననే చూస్తున్నారని, తను వెనక్కి వెళితే వాళ్ళు కూడా వ్యాన్ తో పాటు వెనక్కి వెళ్తున్నారని, దీంతో తనను చంపడానికే వచ్చారని తెలిసిపోయిందని వర్మ చెప్పారు.

అయితే తాను కారులో నుండి దిగి మెట్ల పైకి పరుగులు పెట్టానని, అలా 5వ ఫ్లోర్ కు చేరుకుని, అక్కడ నుండి లిఫ్ట్ ద్వారా పదవ ఫ్లోర్ కు వెళ్లి ఒకరి ఫ్లాట్ లో కూర్చున్నానని, ఆ సమయంలో తన ఫోన్ ను కారులోనే మరిచిపోయానని చెప్పుకొచ్చారు. అయితే ఆ ఫ్లాట్ లో ఉన్న వారితో మాట్లాడి, వారి కారు డ్రైవర్ ద్వారా, తన కారు డ్రైవర్ తో మాట్లాడితే తెలిసిన విషయం ఏమిటంటే… “వారు లిఫ్ట్ బాగు చేయడానికి వచ్చారు” అని డ్రైవర్ చెప్పాడు. మరి నా వంక అలా ఎందుకు చూసారు? అంటే మిమ్మల్ని గుర్తు పట్టారంట… అందుకే చూస్తున్నారు అని చెప్పడంతో నవ్వుకున్నానని తెలిపారు వర్మ.

ADVERTISEMENT

ఇలాంటి సంఘటనలు తన జీవితంలో చాలా ఉన్నాయని చెప్పిన వర్మ, ఓ సారి తన కారును ఒక అపరిచిత వ్యక్తి బైక్ పై అనుసరించి, తన ఫ్లాట్ వరకు వచ్చేసాడని, కారు దిగిన తాను ఆ వ్యక్తి వైపుకే వెళ్తుంటే… అతని బ్యాగ్ లో చేయి పెట్టి, స్క్రిప్ట్ తీసాడని, తన ఆఫీస్ లోనికి పంపకపోవడంతో, తనను ఫాలో అవుతూ వచ్చాడని… అయితే ఎప్పుడూ నేను భయపడలేదని వర్మ తనదైన ఫిలాసఫీలో చెప్పుకొచ్చారు. అయితే ముందు జరిగిన ఉదంతంలో ఎక్కువగా తన సినిమాలలో చూపించే సన్నివేశాల మాదిరి, తనకే ఎదురుకావడంతో భయపడుతూ పరిగెత్తానని, కానీ అక్కడ భయం కన్నా, తాను ఎలా తప్పించుకోవాలి అన్న ఆలోచనే ఎక్కువగా ఉందని తెలిపాడు. అది వర్మపై జరిగిన ఎటాక్… వర్మ సినిమా తరహాలోనే మరీ కామెడీగా ఉంది కదండీ..!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Romanchakam Review: U.S. Premiere Report

Romanchakam is produced by Bhadrakali Pictures, the banner of Sandeep Vanga and Pranay Vanga, who…

55 minutes ago

Ravi Teja Gave More Confidence To Jr NTR?

Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…

5 hours ago