వర్మ – రత్నకుమారిల భేటీకి ‘ముహూర్తం’ ఖరారు?

Ram gopal varma meet with vagaveeti ratna kumari“వంగవీటి” పేరుతో వర్మ రూపొందిస్తున్న సినిమా గురించి ఇప్పటికే తెలిసిన విషయం. ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు, ఫస్ట్ సాంగ్ కూడా ఇటీవల విడుదలై సంచలనాత్మకంగా మారింది. ఈ తరుణంలో వర్మపై సినీ వర్గాలకు సంబంధించిన శివాజీ వంటి వారితో పాటు పలువురు బహిరంగంగానే విమర్శించినప్పటికీ, వెనుకడుగు వేయని వర్మ, వంగవీటి రంగా భార్య అయినటువంటి రత్నకుమారిని కలుసుకోవడానికి అప్పాయింట్మెంట్ ఖరారు చేసుకున్నారని తెలుస్తోంది.

రంగా వ్యతిరేకించిన వర్గానికి చెందిన రత్నకుమారితో వివాహం జరగడం అప్పట్లో సంచలనాత్మకం. దీంతో రంగా జీవితంలో పెళ్లి అనేది అసలు మలుపుగా స్థానిక వర్గాలు చెప్తుంటాయి. మరి జరిగింది జరిగినట్లే వర్మ సినిమాలో చూపిస్తారో లేదో ఇప్పుడే చెప్పలేం గానీ, ఈ కధలో రత్నకుమారి అభిప్రాయాలు ఏమిటో అన్నది కూడా కీలకంగా మారింది. దీంతో ఈ నెల 24వ తేదీన రత్నకుమారితో భేటీ అయ్యేందుకు వర్మ సమయం తీసుకున్నారని సమాచారం. వంగవీటి కుటుంబంతో పాటు దేవినేని కుటుంబంతో కూడా వర్మ భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT

గతంలో ‘రక్తచరిత్ర’ సినిమా ప్రొడక్షన్ సమయంలో పరిటాల సునీత కుటుంబంతోనూ, మద్దెల చెరువు సూరి వర్గాలతోనూ వర్మ వరుసగా భేటీ అయిన విషయం తెలిసిందే. ‘రియల్’ కధలను ‘రీల్’ పై అద్భుతంగా చూపించడంలో వర్మ శైలి అందరికీ తెలిసిందే. దీంతో “వంగవీటి” సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. ఒక్క విజయవాడకు చెందిన కధే అయినప్పటికీ, వంగవీటి రంగా మరణం అనేది అప్పట్లో రాష్ట్రాన్నే కాదు, దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన విషయం విజ్ఞులకు తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories