
గత కొన్నేళ్లుగా మరీ చీప్ బడ్జెట్ లో చుట్టేయడాన్ని అలవాటుగా మార్చుకున్న వర్మ దీనికీ మినహాయింపు ఇవ్వలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ మరీ అథమంగా ఉన్నాయి. జగన్, భారతి పాత్రధారులు తప్ప మిగిలినవాళ్లంతా బి గ్రేడ్ ఆర్టిస్టులే కనిపిస్తున్నారు. స్క్రీన్ ప్రెజెన్స్ కి ఏ మాత్రం సూటవ్వని మొహాలు చాలానే ఉన్నాయి. సరే వ్యూహం అని పేరు పెట్టారు. పాయింట్ దేని గురించో క్లారిటీ ఇచ్చారు.
కానీ ఇందులో నిజాలు ఉన్నాయా అంటే బుర్ర గోక్కునే పరిస్థితే కనిపిస్తుంది. వైఎస్ పాలనలోనే చిరంజీవి ప్రజారాజ్యం పెట్టడం, అధికార పార్టీ మీద తీవ్ర విమర్శలు చేయడం మర్చిపోతే చెరిగిపోయేది కాదు. కానీ ఎక్కడా ఆ పాత్రను పెట్టిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఇప్పుడు జగన్, చిరుల మధ్య మంచి దోస్తీ ఉంది. వర్మ బయటికి చెప్పినా చెప్పకపోయినా వైసిపి తరఫున సోషల్ మీడియాలో ప్రచారకర్తగా ప్రవర్తిస్తున వైనం బయటికే కనిపిస్తుంది.
చంద్రబాబు, పవన్ ల మీద తప్ప ఇంకెవరి గురించి విమర్శనాస్త్రాలు వేయకుండా పక్కా ప్లాన్ తో సాగుతున్న వైనం బహిరంగ రహస్యమే. అలాంటప్పుడు వ్యూహాన్ని కేవలం రూలింగ్ పార్టీకు అనుగుణంగా తీస్తారు తప్పించి బయటికి తెలియని వాస్తవాలను చెప్పే సాహసం ఎందుకు చేస్తారు. వైఎస్ చనిపోయిన గంటల్లోనే ఎమ్మెల్యేలు, మంత్రుల దగ్గర జగన్ సంతకాలు తీసుకోవడమనే ఘట్టం పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పటికీ ఒక బ్లాక్ మార్క్ గా చెప్పుకుంటారు.
దానికి సాక్ష్యాలు ఉన్నా లేకపోయినా ఎన్నో సందర్భాల్లో ఆ ఘటనకు సాక్ష్యంగా ఉన్నవాళ్లు పలు ఇంటర్వ్యూలలో చెప్పడం చూశాం. కానీ వర్మ దాని ప్రస్తావనే లేకుండా జాగ్రత్త పడ్డారు. కేవలం జగన్ కోణంలోనే స్క్రిప్ట్ రాసినట్టు అనిపిస్తే అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. ఇంతకు ముందు తీసిన సినిమాలు కూడా ప్రతిపక్ష పార్టీల మీద అనవసరమైన బురద జల్లడానికి తప్ప దేనికీ పనికిరాలేదు.
ఎన్నికలు ఇంకొద్ది నెలల్లో రాబోతున్న తరుణంలో జగన్ కు సాఫ్ట్ కార్నర్ వచ్చేలా ఓ సి గ్రేడ్ దర్శకుడు పడిన తాపత్రయమే ఈ వ్యూహం. వర్మ మొన్న ల్యాప్ టాప్ పట్టుకెళ్లి సిఎం ఆఫీస్ లో జగన్ ను కలిసింది ఈ టీజర్ కట్ కి ఓకే చెప్పించుకోవడం కోసమేనని ఇన్ సైడ్ టాక్. విడివిడిగా అనిపించే ఈ లింకులన్నీ ముడిపెట్టి చూస్తే అసలు వ్యూహం తీయడం వెనుక ఉద్దేశమేంటో సులభంగా అర్థమైపోతుంది.
After Dragon, NTR is expected to join hands with Trivikram Srinivas for GOW. However, a…
Vidya Balan has revealed that missing the chance to play legendary Carnatic singer M.S. Subbulakshmi…