
ఎన్టీఆర్ ఆశీస్సులు తన సినిమాకే ఉండడం వలన, ‘ఎన్టీఆర్ – కధానాయకుడు’ సినిమా వైఫల్యం చెందిందని, ఇంతకంటే మరో ప్రత్యక్ష రుజువు అవసరం లేదని చెప్తూ వరుస ట్వీట్లు చేసారు వర్మ. ఇలాంటి లాజిక్ లలో వర్మకు మరొకరు సాటిరారు గానీ, ఇంతే విధమైన లాజిక్స్ తాను దర్శకత్వం వహించే సినిమాలలో కూడా పెడితే వరుస హిట్లు అందుకునే వారు కదా.. ? అన్నది ప్రేక్షకుల లాజిక్ పాయింట్. మరి ఇంత హంగామా చేస్తున్న “లక్ష్మీస్ ఎన్టీఆర్”లో ఈ పాటి లాజిక్స్ అయినా ఉంటాయో? లేదో? చూడాలి.
తన సినిమాలు రిలీజ్ అయ్యే వరకు చేసిన హంగామాకు రిలీజ్ రోజుతో ‘శుభం కార్డు’ వేయడం వర్మకు పరిపాటి. మరి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విషయంలోనూ అదే జరుగుతుందో లేదో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. నిర్మాత మార్చి లో రిలీజ్ అంటున్నారు గానీ, ఇటీవల వర్మ సినిమాల రిలీజ్ ల ట్రెండ్ చూస్తుంటే ఇంకొంత కాలం ఆలస్యం అయినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదన్నది ట్రేడ్ టాక్. ఎందుకంటే జనవరి 26 విడుదల అంటూ ఇప్పటికే ఓ సారి ప్రకటించి వాయిదా వేసిన సంగతి సినీ ప్రేక్షకులకు తెలియనిది కాదు.
Hyderabad police have busted an alleged prostitution racket operating from a service apartment in Madhapur…
స్థానిక ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను గమనించిన సీఎం బాబు కూటమి పార్టీ నేతల గెలుపు కోసం టీడీపీ…