Telugu

మరో అమ్మాయికి పడిపోయిన వర్మ!

రాంగోపాల్ వర్మ పేరు చెప్పగానే శ్రీదేవి పేరు గుర్తుకు రావడం సహజమే. ఎన్నో ఇంటర్వ్యూలలో, సినీ వేడుకలపై శ్రీదేవిని ప్రశంసించినంత మరో హీరోయిన్ ను వర్మ పొగడలేదు. అయితే జయసుధ అంటే కూడా తానూ ఎంతో ఆరాధించానని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. కానీ, లేటెస్ట్ మరో అమ్మాయి ఫోటో చూసి వర్మ ఫ్లాట్ అయ్యారు.

ఎంతగా ఆ ఫోటో వర్మను ఆకర్షించింది అంటే… ఆమె పేరు తెలవకపోవడంతో… ఆ అమ్మాయి ఫోటోను పోస్ట్ చేసి… ఈమె డీటెయిల్స్ తెలిస్తే ఎవరైనా చెప్పండి అంటూ నెటిజన్లకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. అయితే కొద్ది నిముషాలలోనే నెటిజన్లు వర్మ ఇచ్చిన పజిల్ ను చేదించి, ఆమె నిషాల్ సోలంకిగా తెలిపారు. దీంతో ఆ ఫోటోను షేర్ చేస్తూ వర్మ ఆమెకు ఓ ట్వీట్ కూడా చేసారు.

ADVERTISEMENT

“నా ట్విట్టర్ ఫ్రెండ్స్ ద్వారా నీవెవరో తెలిసింది… నేను ఇప్పటివరకు చూసిన వారిలో నీవే అత్యంత క్లాసిక్ ఎలెగేన్స్ ఉన్నావంటూ” వర్మ ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ప్రపంచంలో దేవుడు సృష్టించిన ఏకైక అద్భుతం ఒక్క మహిళ మాత్రమేనని, మహిళల అందాలను ఆరాధించడం తన నైజమని ఇటీవల వర్మ చెప్పిన విశేషాలను నెటిజన్లు మరవక ముందే… తన మాటల ఆంతర్యం ఏమిటో వర్మ చెప్పకనే చెప్పారు.

Share
Saumya

Saumya is a passionate Telugu movie addict and an avid binge watcher of OTT platforms, covering Travel, Bollywood, Tamil, Kannada, Malayalam, and international cinema. With a decade of experience at M9 News, Saumya br…

Published by

Recent Posts

పిఠాపురం … మంగళగిరి … కుప్పం…నేతల చిత్తశుద్ధికి నిదర్శనాలా.?

రాజకీయాలలో హామీలు ఇవ్వడం సులభం. కానీ వాటిని కార్యరూపంలోకి తీసుకురావడం మాత్రం అంత సులభం కాదు. ఎన్నికల సమయంలో నియోజకవర్గాల…

57 seconds ago

షర్మిల రీ ఎంట్రీ కోసం జగన్ ఎదురుచూస్తున్నారా.?

వైసీపీ లో షర్మిల రీ ఎంట్రీ, అన్న చెల్లెళ్ళ మధ్య పంచాయితీకి ఎండ్ కార్డు పడింది, వైఎస్ కుటుంబం తిరిగి…

33 minutes ago