
‘బాహుబలి’ పాత్ర పోషించడంలో ప్రభాస్ ను మించిన హీరో లేరు అని మొదలుపెట్టిన వర్మ, తాజాగా ప్రభాస్ కులం వరకు కామెంట్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఇతర హీరోలు కమ్మ, కాపు అంటూ కులాలకు అనుగుణంగా స్టార్స్ గా ఎదిగారని… కానీ ప్రభాస్ తన కులమైన రాజులపై దృష్టి పెట్టలేదని, అందుకే ప్రాంతీయ హీరో కాకుండా ఇంటర్నేషనల్ హీరోగా ప్రభాస్ ఎదిగారని అభివర్ణించారు. అలాగే ముస్లిం, క్రిష్టియన్, హిందువుల మూడు మతస్తుల దేవుళ్ళను ఒక్కటి చేస్తే అది ప్రభాస్ అంటూ ఏకంగా దేవుళ్ళతో పోల్చాడు.
ఇక్కడ గమనించాల్సిన విషయ ఏమిటంటే… వర్మ ప్రశంసలు కురిపిస్తున్నంత వరకు అంతా బాగానే ఉంటుంది. వర్మ ట్వీట్లకు అభిమానుల్లో కూడా కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది. అయితే ప్రభాస్ పై ఇంతలా ప్రశంసలు కురిపిస్తున్న వర్మ, ఏదొక విషయంలో ఇంతకంటే దారుణంగా ‘గాలి’ తీసేస్తారన్న విషయం పవన్ కళ్యాణ్ అంశంలో నిరూపణ అయ్యింది. గతంలో పవన్ పై కూడా ఇలాగే వరుసగా ప్రశంసలు కురిపిస్తూ… ఏకంగా దేవుడితో పోల్చారు. కట్ చేస్తే… కొద్ది రోజుల తర్వాత అదే పవన్ ను ఎవరూ విమర్శించలేని రీతిలో ఏకిపారేసారు.
‘పెరుగుట విరుగుట కొరకే’ అన్న చందంగా… వర్మ ఎంతగా మునగ చెట్టు ఎక్కిస్తే… అంతలా కిందికి పడేస్తారని అర్ధం. అందుకే వర్మ నుండి ఏదొక సమయంలో ప్రభాస్ కు మూడిందే… అంటూ యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ను నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. చూడబోతుంటే… ‘బాహుబలి 2’పై గానీ, ప్రభాస్ పై గానీ వర్మ ట్వీట్లు ఇప్పట్లో ఆగేలా కనపడడం లేదు. అయితే ఎన్ని ట్వీట్లు వేస్తారో అంత డేంజర్ జోన్ లో మన ‘డార్లింగ్’ ప్రభాస్ ఉన్నట్లుగా అర్ధం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
The last time, Pawan Kalyan delivered a good theatrical experience to a reasonable extent was…
Nimrit Kaur is redefining raw ethnic elegance with an earthy, unapologetically sultry photoshoot that is…