ఏం బ్రతుకులురా మీవి.. చి..చి.. ఏ హీరో కి దమ్ముంది?

తమ అభిమాన హీరోలను డెమి గాడ్స్ మాదిరి ఆరాధిస్తుంటారు సినీ ప్రేమికులు. అయితే హీరోల పై తమ అభిమానులు చూపే ఈ పిచ్చి ప్రేమ ఆ హీరోలకు ఎంత వరకు చేరుతుంది అనేది తాజాగా విడుదలైన రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చిత్రం టీజర్ లో ఒకే ఒక్క డైలాగ్ లో చూపించాడు దర్శకుడు.

“ఫ్యాన్ …ఫ్యాన్ అంటూ నువ్వు గుడ్డలు చింపుకోవడమే కానీ…నువ్వు ఒకడివున్నావని కూడా ఆ హీరోకి తెలియదు, ఎం బతుకులు రా మీవి…ఛీ..ఛీ..” అంటూ ట్రైలర్ లో వచ్చే ఈ లాస్ట్ డైలాగ్ అందులో రామ్ చూపించే హావభావాలు వాస్తవికతకు చాల దగ్గరగా ఉన్నాయి.

ADVERTISEMENT

ఈ ఒక్క డైలాగ్ మూవీ పై ఆసక్తిని ఆమాంతం రెట్టింపు చేసింది. ఇక మూవీ రిలీజ్ కి ముందు కావలసిన పాజిటివ్ బజ్ ను కూడా చిత్రానికి అందింది. అలాగే ఈ డైలాగ్ చాలామంది స్టార్ హీరోల అభిమానులకు సూటిగా తగలడంతో పాటు బాణంలా గుచ్చుకుంటుంది కూడా.

దీనితో ఇప్పుడు ఈ డైలాగ్ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. మరి ముఖ్యంగా స్టార్ హీరో అభిమానుల పేరుతో సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ చేసుకునే డై హార్డ్ ఫాన్స్ కి ఈ డైలాగ్ యదార్ధాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించింది.

వాస్తవానికి చిత్రంలో మురళి శర్మ నోటి నుంచి వచ్చే ఈ మాట అక్షర సత్యమనే చెప్పాలి. తమ మూవీ ప్రమోషన్లలో తప్ప హీరోలెవరు మరి ముఖ్యంగా స్టార్ డం ఉన్న పెద్ద హీరోలెవరు కూడా సాధారణ ప్రేక్షకుడినే కాదు కనీసం వారిని దైవంలా ఆరాధిస్తు వారికీ ఆ స్థాయిని అందించిన అభిమానులను సైతం స్మరించరు, పట్టించుకోరు.

కానీ వీరు మాత్రం అభిమానం పేరుతో ధియేటర్ల దగ్గర నుంచి సోషల్ మీడియా కామెంట్స్ వరకు చేసే ఫ్యాన్ వార్స్ , తమ అభిమాన హీరోను డిఫెండ్ చెయ్యడానికి వారు పడే తపన, తాపత్రయం కానీ అంతా ఇంత కాదు. అయితే ఇవేమి కూడా ఆ హీరోలకు తెలిసే అవకాశమే ఉండదు. ఒక వేళ తెలిసినా తెలియనట్టే ఉంటారు తప్ప వారిని ఇటు ప్రోత్సహించరు అలాగని అటు వ్యతిరేకించను లేరు.

తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు హీరోల కటౌట్ కి పాలాభిషేకాలు, గజమాలలు, డప్పులు, డీజేలు, రక్త తిలకాలు ఇలా నానా హంగామా చేస్తారు. అలాగే ఆ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చిందంటే చాలు ఇక వారి ఆనందానికి ఇతర హీరోలు విమర్శలు ఎదుర్కోవల్సిందే అన్నట్టుగా మా వాడే తోపు, తురుము, రికార్డులన్నీ మా వాడి పేరు మీదే అంటూ అర్ధం పర్థం లేని ఫ్యాన్ వార్స్ షురూ చేస్తారు.

అలాగే ఇటు చిత్రానికి నెగటివ్ టాక్ వచ్చినా దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండరు. ఇదంతా కూడా పలానా హీరో అభిమానులు సృష్టిస్తున్న విష ప్రచారమని, ఇప్పుడు మా హీరో సినిమాకి ఇలా చేస్తే రేపు మీ హీరో సినిమాకి మేం అలా చేస్తాం అంటూ ఇక్కడ మరోరకమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది.

ఇలా వారు ఎవరి కోసం ఇంతలా ఆవేశ పడుతున్నారో, ఇంతలా మరో హీరోల అభిమానులతో కొట్లాడుతున్నారో అన్నది ఆ హీరోలకు తెలుస్తుందా.? వీరి అభిమానం వారికి అర్ధమవుతుందా.? అంటే అందుకు ఈ వీరాభిమానులు దగ్గర సమాధానం ఉండదు.

చివరికి మేము – మేము బాగానే ఉంటాము…మీరు – మీరు కూడా బాగుండాలి అంటూ అదే హీరోల నోటి నుంచి విలువైన మాటలు వినాల్సి ఉంటుంది. దీనితో వీరి అనవసర శ్రమ, విలువైన సమయం వృధా కావడం తప్ప అభిమానంపేరుతో వీరు సాధించేది శూన్యమే అవుతుంది.

ఇలా సినీ అభిమనుల అత్యుత్సహాన్ని ఇంత వాస్తవిక ధోరణిలో చెప్పడానికి ముందుకొచ్చిన రామ్ పోతినేని మాత్రం నిజంగా డేరింగ్ స్టెప్ తీసుకున్నారనే చెప్పాలి. నిజానికి ఇవన్నీ బయట సాధరణంగా అందరికి కనిపించే దృశ్యాలే, ప్రతి ఒక్కరికి తెలిసిన వాస్తవాలే. కానీ దానిని ధైర్యంగా వెండి తెర మీద ఇంత వాస్తవిక రూపంలో చూపించడం మాత్రం నిజంగా ఒక పెద్ద సాహసమనే చెప్పాలి.

తమ సినిమాలో ఇటువంటి సాహసాలు చేసేందుకు ఏ ఒక్క స్టార్ హీరో కూడా సాహసించరు. ఎందుకంటే ఇది వారికి అంతటి స్టార్ డం అందించిన అభిమానులను బాధపెట్టడమే అవుతుంది. కాబట్టి ఇకనైనా ఫ్యాన్ వార్స్ పేరుతో జరిగే సోషల్ మీడియా యుద్దాలకు అభిమానులు బ్రేకులు వేస్తే మంచిది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Star Cricketer’s ‘Perfect Innings’ Suddenly Ends: What Went Wrong?

Prithvi Shaw and Akriti Agarwal have called off their engagement around six months after announcing…

33 minutes ago

Money And Lands: KTR’s Old Videos Viral Now!

Telangana politics have started to revolve around the discussion on lands and illegal monetary gains…

1 hour ago