
24 మార్చి 2022 లో వచ్చిన RRR సినిమాతో పాన్ ఇండియా నుండి పాన్ వరల్డ్ కి చేరుకున్న జూ. ఎన్టీఆర్ స్థాయికి తగ్గ సినిమా కోసం ఆయన అభిమానులు రెండేళ్ల నుంచి ‘దేవర’ కోసం ఎదురు చూస్తున్నారు.
అయితే రాజమౌళి సెంటిమెంట్ ను ఎన్టీఆర్ తిప్పించుకోగలుగుతాడా, కొరటాల మరోసారి ఈ సెంటిమెంట్ బారిన పడతారా అన్న సందేహాలతో ఎన్టీఆర్ అభిమానులలో ఆందోళన కూడా ఆస్థాయిలోనే కనపడుతుంది.
27 సెప్టెంబర్ 2024 లో రాబోతున్న దేవర సినిమా పై అంచనాలు ఆకాశాన్ని అంటాయనే చెప్పాలి. ఇటు తారక్ ఫాన్స్ తో పాటుగా టాలీవుడ్ కూడా ఈ సినిమా పై మంచి అంచనాలు పెంచుకుంది. దేవర టాలీవుడ్ కు మరో పాన్ ఇండియా హిట్ అందిస్తుంది అన్న అంచనాలతో ఇటు ట్రేడ్ వర్గాలు కూడా ఈ సినిమా పట్ల మంచి పాజిటివ్ బజ్ కనపరుస్తున్నాయి.
అయితే ఈ సినిమా నుండి వచ్చిన ప్రతి ప్రమోషన్ కంటెంట్, గ్లిమ్స్ నుంచి సాంగ్స్ వరకు కూడా తారక్ అభిమానులతో పాటుగా సాధారణ ప్రేక్షకుడిని కూడా ఆకట్టుకున్నాయి. ఈ మూవీ నుండి విడుదలైన రెండు లిరికల్ సాంగ్స్ కూడా సూపర్ హిట్ అవడంతో అటు మ్యూజికల్ పర్గంగా కూడా సోషల్ మీడియాలో తన సత్తా చూపిస్తుంది దేవర. అనిరుధ్ అందించిన బాణీలు సినిమా పై అంచనాలను పెంచుతున్నాయి.
ముందుగా వచ్చిన సింగిల్ ‘ఫియర్’ సాంగ్, ఆ తరువాత వచ్చిన ‘చుట్టమల్లే’ రొమాంటిక్ సాంగ్ కానీ ఇంస్టాగ్రామ్ రీల్స్ తో దుమ్ము దులుపుతుంది. చుట్టమల్లే సాంగ్ లో తారక్, జాన్వీ మధ్య కెమిస్ట్రీ కి ఇటు టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ కూడా ఫిదా అయిపోయింది. ఇక అతి త్వరలో ఈ మూవీ నుండి ముచ్చటగా మూడో సాంగ్ విడుదల కాబోతుంది, అది వీటిల్ని మించి ఉంటుంది అంటూ తారక్ ఫాన్స్ ను ఊరిస్తున్నారు గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రి.
మూడో పాట…పాటకు మించి ఆట… ఇక కన్నుల పండుగే, ఈ పాటను తారక్ ఒక ఆట ఆడుకున్నాడట, ఎప్పుడని అడక్కండి, ఎప్ప్పుడొచ్చిన బీభత్సమే, ఈ ఆల్బమ్ ‘వేరే లెవెల్’ అంతే అంటూ తన X లో పోస్ట్ చేసారు రామ జోగయ్య. రామయ్య ఇచ్చిన హైప్ ను అందుకోవడంలో తారక్ తగ్గే ఛాన్స్ ఏ లేదంటు మూడో పాట కోసం నీ ఫాన్స్ వెయిటింగ్ అంటున్నారు తారక్ ఫాన్స్.
అలాగే దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్న జాన్వీ కపూర్ తన అందాలతో అతిలోక సుందరి కూతురిగా తన పేరు నిలబెట్టుకుంది. దేవర తరువాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను సైన్ చేస్తూ తల్లి శ్రీదేవి మాదిరే అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్ లో పాగా వేయడానికి రెడీ అయ్యింది.
ఇప్పటికే పుష్ప-2 లో ఐటెం సొంగ్ కు జాన్వీ ‘ఊ’ చెప్పినట్లు సమాచారం.ఆ తరువాత రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న సినిమాలో తళుక్కు మంటారు. దేవర అంచనాలకు తగ్గట్టే ఊహించిన విజయాన్ని అందుకుంటే జూనియర్ తో పాటుగా జాన్వీ క్రెజ్ కూడా వేరే లెవెల్ అవుతుంది.
Imran Khan recently came into the headlines when he was detained during demonstrations organized in…
Vijay Deverakonda and Rashmika Mandanna's upcoming film Ranabaali has cleared the censor process ahead of…