
ఇది ఇలా ఉండగా రామోజీ గ్రూప్ ఎండీ అట్లూరి రామ్మోహన్ రావు చంద్రబాబు నాయుడుకు కేటాయించిన గదికి వెళ్లి ఇటీవలే జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఈనాడు చేసిన సర్వే ఫైల్ అందజేసినట్టు సమాచారం. ఈనాడుకి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న విస్తృత నెట్ వర్క్ తో చేసిన సర్వే ఖచ్చితత్వాన్ని మారు పేరు. అయితే ఈనాడు కానీ ఈటీవీ గానీ సర్వేలు ప్రచురించే సంప్రదాయం లేదు. అయినా ప్రతీ ఎన్నికలకు వారు సర్వే చేస్తుంటారు.
అయితే ఈ సర్వేలో ఏం ఉంది అనేది మాత్రం తెలియరాలేదు. కొందరు తెలుగు తమ్ముళ్లు మాత్రం తెలుగుదేశం పార్టీ మరొక సారి అధికారంలోకి రాబోతుందని రామోజీ రావు కంఫర్మ్ చేశారు అని అంటున్నారు. రేపు అమరావతిలో జరిగే టీడీపీ అభ్యర్థుల సమావేశానికి చంద్రబాబు హాజరు కాబోతున్నారు. ఆ సమావేశంలో చంద్రబాబు ఈ సర్వేను అభ్యర్థులతో పంచుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. కాగా మే 23న అంటే ఇంకొక నెల సమయం ఉంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు.
Kiara Advani has once again become a major topic of discussion on social media. While…
Aarti Chikara is redefining summer glamour with her latest poolside revelation. Draped in a vibrant…