
సెలబ్రెటీలుగా ఉన్నవారిపై పూలు పడుతుంటాయ్, రాళ్లు కూడా పడుతుంటాయ్… పూలు పడిపడినప్పుడు బాగానే ఉంటుందని, రాళ్లు పడినప్పుడు మాత్రం కొంచెం బాధగా అనిపిస్తుంటుంది. ఇటీవల కాలంలో టాలీవుడ్ ను డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తోందని… మీ ఇంటికి కూడా ఏదో పార్శిల్ వచ్చిందని, ఎక్సైజ్ అధికారులు మీ ఇంటికి వచ్చారనే వార్తలు వచ్చాయని… అసలేం జరిగిందని ప్రశ్నించగానే రానా ముఖ కవళికలు మారిపోయాయి. చివరకు యాంకర్ పై చిటిక వేస్తూ, ఇలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్ లు వేయద్దంటూ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు.
రానా ఇచ్చిన పవర్ ఫుల్ సమాధానంతో సదరు యాంకర్ బిత్తరపోగా, దీనిని ప్రోమోగా కట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. ఇదంతా సదరు ఇంటర్వ్యూపై ఆసక్తి కలిగించడానికి సదరు మీడియా ఛానల్ మరియు రానా చేసిన కామెడీ స్టంట్ గా కనపడుతోంది. కేవలం ఈ ప్రోమోనే ఇప్పటివరకు నాలుగున్నర్ర లక్షల మందికి పైగా వీక్షించారంటే నెటిజన్లు దీనికి ఎలా పట్టం కట్టారో అర్ధం చేసుకోవచ్చు. ‘మసాలా లేనిదే ఈ ఆడియన్స్ చూస్తారా?’ అంటూ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాలో బ్రహ్మి అన్న డైలాగ్ ను గుర్తుకు తెస్తుంది ఈ ప్రోమో.
Ajit Agarkar’s future as India’s chief selector could be heading for another turn. His current…
One of the main advantages for Pawan Kalyan, from the early stages of political career…